అదిరిపోయే ఆఫర్.. ఆ రెస్టారెంట్ లో కస్టమర్లకు ఉచితంగా వైన్ సప్లై..

by Disha Web Desk 20 |
అదిరిపోయే ఆఫర్.. ఆ రెస్టారెంట్ లో కస్టమర్లకు ఉచితంగా వైన్ సప్లై..
X

దిశ, ఫీచర్స్ : తమ వ్యాపారాన్ని పెంచుకునేందుకు వ్యాపార వర్గాలు ఎన్నో ఆఫర్లను ప్రకటించి కస్టమర్లను ఆకర్షించుకుంటారు. అలాగే హోటల్‌లు, కేఫ్‌లు, రెస్టారెంట్లలో కూడా తమ కస్టమర్‌లను ఆకర్షించడానికి ఎన్నో ఆఫర్లను ప్రకటిస్తారు. అలాగే ఈ మధ్యకాలంలో ఓ రెస్టారెంట్ కూడా తమ కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్ ని అందిస్తోంది. దానికి సంబంధించిన ఓ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో కస్టమర్లందరూ అక్కడికి వెల్లేందుకు క్యూ కడుతున్నారు. ఇంతకీ ఆ రెస్టారెంట్ ఎక్కడ ఉంది, అక్కడ ప్రకటించిన ఆఫర్ ఏంటో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది కదా. అయితే వివరాలను తెలుసుకుందాం.

ఇటలీకి చెందిన ఓ రెస్టారెంట్ తన కస్టమర్ల కోసం ఓ ప్రత్యేకమైన ఆఫర్‌ను ప్రకటించింది. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. మీరు ఒక చిన్న విషయానికి అంగీకరిస్తే, డిన్నర్‌లో మీకు వైన్ బాటిల్‌ను ఉచితంగా ఇస్తానని రెస్టారెంట్ యాజమాన్యం చెబుతోంది.

ది గార్డియన్ నివేదిక ప్రకారం ఇటలీలోని వెరోనాలోని అల్ కాండోమినియో అనే రెస్టారెంట్ కస్టమర్లను ఆకర్షించడానికి ఉచిత వైన్‌ను అందిస్తుంది. అయితే డిన్నర్ సమయంలో తమ ఫోన్‌లను రెస్టారెంట్‌కు సరెండర్ చేయడానికి సిద్ధంగా ఉన్న వినియోగదారులకు మాత్రమే వైన్ బాటిల్ అందుబాటులో ఉంటుందని తెలిపింది.

రెస్టారెంట్‌ ఓనర్ ఏంజెలో లెల్లా మాట్లాడుతూ డైనర్‌లు మొత్తం సమయం ఫోన్‌లతో టైంపాస్ చేయకుండా తమ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ డిన్నర్‌ను ఆస్వాదించేలా ప్రోత్సహించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అందుకే డీల్‌లో భాగంగా ఎవరైనా తమ ఫోన్‌ను సరెండర్ చేస్తే వారికి వైన్ బాటిల్ ఉచితంగా ఇస్తామని తెలిపారు.

ఈ ఆఫర్ తర్వాత తనకు కస్టమర్ల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోందని ఏంజెలో చెప్పారు. 90% మంది ప్రజలు తమ ఫోన్‌లను పక్కన పెట్టి, ఉచిత వైన్ ఆఫర్‌ను ఎంచుకుంటున్నారు. ఏంజెలో మాట్లాడుతూ కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపడం, నవ్వడం కస్టమర్లను సంతోషపెట్టడమే కాకుండా, రెస్టారెంట్ వాతావరణాన్ని కూడా ఆహ్లాదకరంగా మారుస్తుందని తెలిపారు.

ఇతరుల కంటే ప్రత్యేకమైన రెస్టారెంట్‌ను రూపొందించాలనుకుంటున్నామని వారు చెప్పారు. అందుకే వారు ఈ స్టైల్‌ని ఎంచుకున్నామని, ఇందులో కస్టమర్‌లు సంతోషాలను పంచుకుంటూ మొబైల్‌లకు దూరంగా ఉంటారని తెలిపారు. అల్ కాండోమినియో వెరోనాలో ఈ రకమైన ఆలోచనను ఉపయోగించిన మొదటి రెస్టారెంట్‌ ఇదేనని చెబుతున్నారు.

Read More...

ఓరినీ వీడికేం పోయేకాలం.. నడుస్తున్న కారుకు వేలాడదీసుకుని గలీజ్ పని చేస్తున్నాడే.. డేంజరస్ వీడియో వైరల్



Next Story

Most Viewed