యువకుడి చేతికి చిక్కిన ఆంటీ! ఛీ.. ఛీ.. చికెన్ షాపులో కూడా ఇలా చేస్తారా..? (వీడియో)

by Disha Web Desk |
యువకుడి చేతికి చిక్కిన ఆంటీ! ఛీ.. ఛీ.. చికెన్ షాపులో కూడా ఇలా చేస్తారా..? (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఉచితంగా వస్తుందంటే పినాయిల్ తాగే మనుషులు ఉంటారనే నానుడి ఉంది. అలాగే ఎవరూ చూడటం లేదంటే టాయ్‌లెట్ వెళ్లే లోటలను కూడా ఎత్తుకెళ్లే రకాలు ఉంటారు. ఇదే మాదిరిగా వ్యవహరించిందో ఆంటీ. చికెన్ కోసం మరో మహిళతో కలిసి వెళ్లిన ఆంటీ అక్కడ ఎవరూ చూడటం లేదని కోడిగుడ్లను నొక్కేసింది. వీడియోలో ఉన్నదాని ప్రకారం.. చికెన్ షాపులో యువకుడు మాంసం కట్ చేస్తుండగా.. ఆయన వెనకకే నిలబడిన మహిళల్లో ఓ ఆంటీ పక్కన్నే ఉన్న కోడిగుడ్ల ట్రే నుంచి మూడు ఎగ్స్‌ని తీసుకోని సంచిలో వేసుకుంది. చివరి గుడ్డును దొంగిలిస్తుండగా గమనించిన యువకుడు వెంటనే వచ్చి ఆమె సంచిని చెక్ చేస్తాడు. దాంట్లో ఎగ్స్ ఉండటంతో ఏంటి ఈ పని అంటూ నిలదీశాడు. అయితే ఈ ఎగ్స్ పక్క షాపులో కొనుగోలు చేశానని ఆంటీ బుకాయించినా.. మీరు చేసిన దొంగతనం సీసీ కెమెరాలో రికార్డ్ అయిందని తీసి చూపించాడు. అయినా ఆంటీ నేను దొంగతనం చేయలేదని.. అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేస్తుంది. ఈలోపు చుట్టు జనం గుమ్మికూడటంతో ఆమె అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story

Most Viewed