లోబడ్జెట్‌లో ‘ఊటీ’ ని చూసేయండి..! IRCTC నుంచి స్పెషల్ ప్యాకేజ్

by Harish |
లోబడ్జెట్‌లో ‘ఊటీ’ ని చూసేయండి..! IRCTC నుంచి స్పెషల్ ప్యాకేజ్
X

దిశ, వెబ్‌డెస్క్: కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా..? ఎక్కడికి వెళ్లాలి, ఎలా వెళ్లాలి అని ఆలోచిస్తున్నారా..? అయితే మీకోసమే ఇండియన్ రైల్వే కాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC) కొత్తగా ఒక టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేయాలనుకునే వారి కోసం కొండలు, చుట్టూ చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, భూతల స్వర్గంగా పిలవబడే ‘ఊటీ’ ని చూడటానికి IRCTC తక్కువ ధరలో ప్యాకేజీని ఆఫర్ చేస్తుంది.

5 రాత్రులు, 6 పగలు సాగే ఈ టూర్‌లో ఊటీ - కన్నూర్ ప్రదేశాలను చూడవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్ నుంచి టూర్ మొదలవుతుంది. రాబోయే టూర్ తేదీ జూన్ 6, 2023 న ప్రారంభమవుతుంది. విహారయాత్రకు వెళ్లాలనుకునేవారు IRCTC టూరిజం ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. ఈ ప్యాకేజీలో భాగంగా IRCTC వారు అన్ని ఏర్పాట్లు చేస్తారు.


ఊటీ - కన్నూర్ టూర్ పూర్తి వివరాలు

* మొదటి రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు 12 గంటల వరకు చేరుకోవాలి. రైలు నం.17230, శబరి ఎక్స్‌ప్రెస్‌లో టూర్ మొదలవుతుంది. మధ్యాహ్నం 12.20 గంటలకు రైలు బయలుదేరుతుంది. ఆ రోజంతా జర్నీ చేస్తారు.

* రెండో రోజు కోయంబత్తూరు రైల్వే స్టేషన్‌కు ఉదయం 8:02 గంటలకు చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి 90 కి.మీ దూరంలో ఉన్న ఊటీకి బయలుదేరుతారు. అక్కడ ముందే బుక్ చేసిన హోటల్‌కు చేరుకుని కాసేపు విశ్రాంతి తీసుకున్నాక, మధ్యాహ్నం బొటానికల్ గార్డెన్స్, ఊటీ సరస్సు సందర్శిస్తారు. తిరిగి సాయంత్రం హోటల్‌కు చేరుకుంటారు. ఆ రోజు రాత్రి అక్కడే బస చేస్తారు.

* మూడో రోజు ఉదయం హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేశాక, దొడబెట్ట శిఖరం, టీ మ్యూజియం, పైకారా జలపాతం చూస్తారు. తిరిగి ఆ రోజు రాత్రి ఊటీలో స్టే చేస్తారు.

* నాలుగో రోజు బ్రేక్‌ఫాస్ట్ చేశాక కన్నూర్ బయలుదేరుతారు. అక్కడ సందర్శనీయ ప్రదేశాలను చూస్తారు. మధ్యాహ్నం సమయంలో తిరిగి ఊటీకి వెళ్తారు. సాయంత్రం టైం ఉంటే లోకల్ షాపింగ్ చేసుకోవచ్చు. ఆ రోజు రాత్రి ఊటీలో బస చేస్తారు.

* ఐదో రోజు బ్రేక్‌ఫాస్ట్ చేసి, మధ్యాహ్నం హోటల్ నుంచి కోయంబత్తూరుకు బయలుదేరుతారు. సాయంత్రం కోయంబత్తూరు టౌన్ రైల్వే స్టేషన్‌లో 16:35 గంటలకు రైలు నెం. 17229, శబరి ఎక్స్‌ప్రెస్‌లో తిరిగి సికింద్రాబాద్ రిటర్న్ జర్నీప్రారంభమవుతుంది.

* ఆరో రోజు మధ్యాహ్నం 12.20 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ చేరుకుంటారు. దీంతో టూర్ పూర్తవుతుంది.


టూర్ ధరల వివరాలు

ప్యాకేజీలో భాగంగా కంఫర్ట్, స్టాండర్డ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి.

కంఫర్ట్ క్లాస్

సింగిల్ షేరింగ్: రూ.31,410.

ట్విన్ షేరింగ్: రూ.17,670.

ట్రిపుల్ షేరింగ్: రూ.14,330.స్టాండర్డ్ క్లాస్‌:

సింగిల్ షేరింగ్: రూ.28,950.

ట్విన్ షేరింగ్: రూ.15,220.

ట్రిపుల్ షేరింగ్: రూ.11,870.

ప్యాకేజీలో భాగంగా రైలు ప్రయాణ చార్జ్‌లు, ట్రావెల్ ఇన్సూరెన్స్, AC హోటల్, ఉదయం 3 రోజుల పాటు బ్రేక్‌ఫాస్ట్ కవర్ అవుతాయి. ప్యాకేజీలో లేనివి.. రైళ్లో భోజన ఖర్చులు, మధ్యాహ్నం భోజనం, దర్శనీయ ప్రదేశాల వద్ద టికెట్ చార్జీలు, గైడ్ తదితర ఖర్చులను ప్రయాణికులే భరించాలి.


Next Story

Most Viewed