ప్రయాణికులు లేని దృష్ట్యా రైళ్లు రద్దు

by  |
ప్రయాణికులు లేని దృష్ట్యా రైళ్లు రద్దు
X

దిశ, బెల్లంపల్లి: కోవిడ్ మహమ్మారి తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రయాణికులు ఆశించిన స్థాయిలో రైళ్లలో ప్రయాణం చేయడానికి ఆసక్తి చూపకపోవడంతో సికింద్రాబాద్ మధ్య నడిచే రెండు రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ కైలాష్ వెల్లడించారు. కాగజ్ నగర్ నుండి సికింద్రాబాద్ మధ్య నడిచే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ 07011,07012రైలుతో పాటు బాలాజీ నగర్ సికింద్రాబాద్ మధ్య నడిచే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ 07233, 07234లను ఈనెల ఏడో తేదీ నుండి జూన్ 31వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రయాణికులు రద్దు చేసిన రైళ్ల పట్ల వినియోగదారులు రైల్వేశాఖకు సహకరించాలని సూచించారు.



Next Story

Most Viewed