పోలీసు వాహనాల్లో మద్యం, డబ్బు: ఉత్తమ్

by  |
పోలీసు వాహనాల్లో మద్యం, డబ్బు: ఉత్తమ్
X

దిశ, కోదాడ: టీఆర్ఎస్ ప్రభుత్వం సాగర్ ఉపఎన్నికలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌తో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఉప ఎన్నికలో కొవిడ్ నిబంధనలకి విరుద్దంగా లక్షమందితో హాలియలో కేసీఆర్ సమావేశం నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ సభ కారణంగా పేదలు కరోనా బారిన పడే అవకాశం ఉందని.. దీనికి ఎవరు భాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలవాలని ప్రభుత్వం.. పోలీసు వాహనాల్లో మద్యం, డబ్బు తరలిస్తున్నారని ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. తక్షణమే సాగర్‌‌లో ప్రతి మండలం సరి హద్దుల్లో చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసి కేంద్ర బలగాలతో సోదాలు నిర్వహించాలన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం అడ్డదారులు తొక్కడం ఏంటని ఫైర్ అయ్యారు. అధికారంలో ఉండి దుర్వినియోగానికి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed