వీడు జెమ్ కాదు.. తుఫాన్!

by Jakkula Samataha |
వీడు జెమ్ కాదు.. తుఫాన్!
X

దిశ, సినిమా : బాలీవుడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్ హీరోగా నటించిన ‘తుఫాన్’ టీజర్‌ రిలీజ్ చేశారు మేకర్స్. గతంలో ఫర్హాన్ అక్తర్ నటించిన ‘భాగ్ మిల్కా భాగ్’ మూవీని డైరెక్టర్ చేసిన ఓం ప్రకాశ్ మెహ్రా.. ఈ స్పోర్ట్స్ డ్రామాను తెరకెక్కించగా, బాక్సింగ్ రింగ్‌లో పర్ఫార్మ్ చేస్తున్న ఫర్హాన్ ఇంటెన్స్ లుక్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ప్రొఫెషనల్ బాక్సర్‌గా ఫర్హాన్ మేకోవర్ చూస్తే ఫిదా కావలసిందే. టీజర్ చూస్తుంటే ప్రారంభంలో గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించిన ఫర్హాన్.. ఆ తర్వాత బాక్సర్‌గా మారినట్టు తెలుస్తోంది. ‘అజ్జు.. ఓ గ్యాంగ్‌స్టర్, అజీజ్ అలీ.. ఓ బాక్సర్.. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో చాయిస్ నీదే’ అని హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ ఫర్హాన్‌తో చెబుతున్న మాటలు చూస్తుంటే.. తను హీరోను గైడ్ చేసే పాత్రలో కనిపిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇక చివరలో ‘ఈ జెమ్‌ను ఎక్కడ నుంచి తెచ్చారు? వీడు జెమ్ కాదు, తుఫాన్’ వాయిస్‌‌తో టీజర్ ముగియగా.. బాక్సింగ్ కోచ్ పాత్రలో పరేష్ రావల్ కనిపించాడు. కాగా ఈ ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ డ్రామాను అమెజాన్ ప్రైమ్ మే 12న రిలీజ్ చేయనుంది.



Next Story

Most Viewed