20 నుంచి టోల్ వసూలు

by  |
20 నుంచి టోల్ వసూలు
X

న్యూఢిల్లీ: ఈ నెల 20 నుంచి జాతీయ రహదారులపై టోల్ ఛార్జీలను వసూలు చేయనున్నారు. ఈ మేరకు ఎన్‌హెచ్ఏఐ(జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ)కు కేంద్ర రోడ్డు రవాణా శాఖ లేఖ రాసింది. అయితే, దీనిపై రవాణా సంఘాలు పెదవి విరుస్తున్నాయి. ప్రస్తుత విపత్కర పరిస్థితులను తట్టుకొని ట్రక్కుల యజమానులు నిత్యావసర వస్తువుల రవాణా‌ను చేపడుతున్నారనీ, ఇలాంటి సమయంలో టోల్ ఛార్జీలను వసూలు చేస్తే రవాణా రంగం కుదేలవుతుందని అఖిల భారత మోటారు ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రస్తుతం లారీ డ్రైవర్లకు జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేసింది. కాగా, కరోనా వైరస్ విజ‌ృంభిస్తున్న నేపథ్యంలో అత్యవసర సేవలపై భారాన్ని తగ్గించడం కోసం మార్చి 25నుంచి కేంద్రం టోల్ వసూళ్లను నిలిపివేసిన సంగతి తెలిసిందే.

Tags: national high ways, toll plaza , april 20, NHAI

Next Story

Most Viewed