గురువారం పంచాంగం, రాశి ఫలాలు (08-04-2021)

184
panchamgam

శ్రీ శార్వరి నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం బహుళ పక్షం
తిధి : ద్వాదశి తె4.22వరకు
(తెల్లవారితే శుక్రవారం)
వారం : గురువారం (బృహస్పతివాసరే)
నక్షత్రం : శతభిషం పూర్తి
యోగం : శుభం మ3.26
తదుపరి శుక్లం
కరణం : కౌలువ సా4.24
తదుపరి తైతుల తె4.22
వర్జ్యం : మ12.48 – 2.26
దుర్ముహూర్తం : ఉ9.58 – 10.47 &
మ2.53 – 3.42
అమృతకాలం: రా10.36 – 12.14
రాహుకాలం : మ1.30 – 3.00
యమగండం/కేతుకాలం: ఉ6.00 – 7.30
సూర్యరాశి: మీనం
చంద్రరాశి: కుంభం
సూర్యోదయం: 5.53
సూర్యాస్తమయం: 6.10

నేటి రాశి ఫలాలు

మేషం

​కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది.విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. మిత్రులనుండి శుభవార్తలుఅందుతాయి వ్యాపారాలలో ఆర్థిక లబ్ధి పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు దక్కుతాయి.

వృషభం

ఋణగ్రస్తుల నుండి మొండి బాకీలు వసూలవుతాయి అధికారుల నుండి నిరుద్యోగులకు కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు నూతన వ్యాపారాలు సజావుగా సాగుతాయి. బంధు మిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు.

మిధునం

కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి ఆర్థిక వ్యవహారాలు నిరాశాజనకంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఒడిదుడుకులు అధికమవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు తప్పవు. చేపట్టిన పనులలో ఆటంకాలుంటాయి.

కర్కాటకం

చేపట్టిన పనులు శ్రమతో పూర్తి చేస్తారు. వ్యాపార వ్యవహారాలలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగ విషయంలో మీకు రావాల్సిన గుర్తింపు వేరేవారికి వచ్చి నిరాశ కలిగిస్తాయి.

సింహం

చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మిత్రుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు. పాత రుణాలు తీర్చడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.

కన్య

దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగుతారు. వ్యాపార విస్తరణకు నూతన అవకాశాలు లభిస్తాయి అధికారుల ఆదరణ పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఉన్నది.

తుల

కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణ సూచన ఉన్నది. వృత్తి వ్యాపారాలు నిరాశాజనకంగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతన సమస్యలు ఉత్పన్నమౌతాయి. ముఖ్యమైన పనులలో స్థిరత్వం లేని ఆలోచనలు చేస్తారు.

వృశ్చికం

వృధా ఖర్చు చేస్తారు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇంటాబయటా ఊహించని సమస్యలు కలుగుతాయి చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. అన్ని రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు నత్తనడక సాగుతాయి.

ధనస్సు

గృహమున వివాహ విషయమై చర్చలు జరుగుతాయి ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సంతాన విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి వ్యాపారాలు పుంజుకుంటాయి ఉద్యోగాలలో అదనపు పనిభారం నుండి ఉపశమనం పొందుతారు. పనులు సకాలంలో పూర్తవుతాయి.

మకరం

స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. చాలా కాలంగా వేధిస్తున్న కుటుంబ సమస్యలను రాజీచేసే ప్రయత్నాలు కలసిరావు. కొన్ని వ్యవహారాలలో నిర్ణయాల్లో ఆకస్మికంగా మార్పులు చేస్తారు. నిరుద్యోగులు అవకాశాలు సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతారు.

కుంభం

పోటీ పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలను పొందుతారు. సమాజంలో నూతన పరిచయాలు కలుగుతాయి ఆలోచనలు ఆచరణలో పెట్టి సత్ఫలితాలు పొందుతారు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగస్తులు పదోన్నతులు పొందుతారు.

మీనం

ఉద్యోగమున వ్యయప్రయాసలు అధికమౌతాయి. స్ధిరాస్తి వివాదాలలో ఒప్పందాలు వాయిదా పడతాయి. ముఖ్యమైన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక సమస్యలు స్థిమితం లేకుండా చేస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి వ్యాపారమున ఊహించని నష్టాలు కలుగుతాయి.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..