కరోనా కరాళ నృత్యం.. 14 లక్షల మార్క్ దాటింది

by  |
కరోనా కరాళ నృత్యం.. 14 లక్షల మార్క్ దాటింది
X

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తోంది. దాని వ్యాప్తి ఆగడంలేదు. రోజురోజుకు పెరుగుతూనే ఉంది. గతకొద్ది రోజుల నుంచి వేల సంఖ్యలో కేసులు పెరుగుతున్నాయి. వందల సంఖ్యలో ప్రజలు చనిపోతున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో 49,931 కొత్త కేసులు నమోదయ్యాయి. 708 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 14 లక్షల 35,453 కు చేరుకుంది. ఇందులో 9 లక్షల 17, 567 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 4 లక్షల 85,114 మంది బాధితులు ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 32,771 మంది బాధితులు కరోనా సోకి మృతిచెందారు. భారత్ లో ఇప్పటివరకు 1.68 కోట్ల కరోనా పరీక్షలు చేయగా, గడిచిన 24 గంటల్లో 5.15 లక్షల కరోనా టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది.



Next Story

Most Viewed