దేశంలో ప్రస్తుతం ఎన్ని కేసులంటే..?

by  |
దేశంలో ప్రస్తుతం ఎన్ని కేసులంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా విలయతాండవం ఆగడంలేదు. దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు రికవరీ రేటు కూడా రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. కానీ, ఈ కరోనా వైరస్ ఎవ్వరినీ కూడా వదలడంలేదు. సాధారణ వ్యక్తుల నుంచి ప్రముఖల వరకు కరోనా సోకుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 49,310 కొత్త కేసులు నమోదయ్యాయి. 740 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 12 లక్షల 87 వేల 945 కు చేరుకుంది. ఇందులో 8 లక్షల 17 వేల 208 మంది బాధితులు కరోనా కోరల నుంచి పూర్తిగా కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 4 లక్షల 40 వేల 135 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 30,601 మంది కరోనా కోరలకు చిక్కి మృత్యువాత పడ్డారు. అలాగే ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కోటీ 54 లక్షల 28 వేల 170, గడిచిన 24 గంటల్లో 3 లక్షల 52,801 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ పేర్కొన్నది.



Next Story

Most Viewed