ప్రగతి భవన్ పిలుస్తోంది.. ఆ ఇద్దరు నేతలకు సీఎం ఆహ్వానం

by  |
pragathi-bavan
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ఉదయం 11.30 గంటలకు ప్రగతి భవన్‌లో అఖిలపక్ష సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. సీఎం ‘దళిత్ ఎంపవర్ మెంట్‌పథకం’పై ప్రధానంగా సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం రాష్ట్రంలోని దళిత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రగతిభవన్ నుంచి పిలుపు అందింది.

అదేవిధంగా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంలను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానించారు. ఈ అల్ పార్టీ మీటింగ్‌లో సీఎం దళిత్ ఎంపవర్ మెంట్ పథకం విధివిధానాలపై చర్చ జరగనున్నట్లు సమాచారం. ఇదిలాఉండగా, సీఎం అధ్యక్షతన జరిగే ఈ మీటింగ్‌కు వెళ్లకూడదని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Next Story