జులైలోనైనా పూర్తి వేతనం చెల్లించాలి

by  |
జులైలోనైనా పూర్తి వేతనం చెల్లించాలి
X

దిశ, హైదరాబాద్: లాక్‌డౌన్ కాలంలో మార్చి, ఏప్రిల్, మేనెలలో కోతలు విధించిన వేతనంతో పాటు జూన్ నెల జీతాన్ని జులైలో పూర్తిగా చెల్లించాలని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం నాంపల్లి కార్యాలయంలో యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించి పలు తీర్మానాలను ఆమోదించారు. ఈ సందర్భంగా రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పనిచేస్తున్న వైద్య సిబ్బంది, జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య సిబ్బందికి బీమా సౌకర్యం కల్పించాలన్నారు. కార్యక్రమంలో టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేందర్, రామినేని శ్రీనివాసరావు, రేచల్, ముజీబ్ హుసేనీ, ప్రతాప్, శ్రీకాంత్, అశోక్, లక్ష్మణ్ పాల్గొన్నారు.

Next Story

Most Viewed