ఎండల నుంచి ఉపశమనం.. మూడ్రోజుల పాటు వర్షాలే

by  |
ఎండల నుంచి ఉపశమనం.. మూడ్రోజుల పాటు వర్షాలే
X

దిశ, వెబ్‌డెస్క్: అసలే తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఎండ వేడికి తోడు వండగాల్పులు, ఉక్కబోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు అన్నిచోట్ల 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదవుతుండటంతో.. ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇలాంటి తరుణంలో తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణశాఖ ఊరట కలిగించే వార్త తెలిపింది.

తెలంగాణలో నేటి నుంచి మూడ్రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు స్పష్టం చేశారు. నైరుతి మధ్యప్రదేశ్ నుంచి కొమరిన్ ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని, అలాగే మహారాష్ట్ర నుంచి కర్ణాటక, కేరళ మీదుగా మరో ఉపరితల ద్రోణి కొనసాగుతుందంది.

వీటి ప్రభావంతో నేడు, రేపు, ఎల్లుండి తెలంగాణలో చాలాచోట్ల వర్షాలు పడే అవకాశముందని అధికారులు తెలిపారు. కొన్నిచోట్ల 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీసే అవకాశముందన్నారు.



Next Story

Most Viewed