ఫారెస్ట్ నర్సరీలో కలుపుమందు కలకలం

by  |
ఫారెస్ట్ నర్సరీలో కలుపుమందు  కలకలం
X

దిశ, ములకలపల్లి: అటవీ అధికారుల నిర్లక్ష్యం నర్సరీల్లో పెంచుతున్న లక్ష మొక్కల జీవన్మరణ సమస్యగా మారింది. పసిపిల్లల మాదిరిగా అత్యంత సున్నితంగా పెంచాల్సిన మొక్కలను అత్యంత ప్రమాదకరమైన రసాయనాలను వాడుతూ మొక్కల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. మధ్యలో కలుపు ఎక్కువగా ఉందని నిబంధనల కు విరుద్ధంగా ఏకంగా నిషేధిత కలుపు మందు పిచికారీ చేసి వాటి చావుకు కారణం అయ్యారు. పచ్చదనం తో కళకళలాడాల్సిన నర్సరీ ఎండిపోయి దర్శనం ఇస్తుంది. విషయం బయటకు పొక్కకుండా నివారణ చర్యలకు పూనుకున్న అధికారుల తీరు విస్మయం కలిగిస్తుంది.

మొక్కలపై కలుపు మందు పిచికారీ..

భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండలంలోని తిమ్మంపేట నర్సరీని అటవీ అధికారులు నడుపుతున్నారు. హరితహారం 2021-22 సంవత్సరానికి లక్ష మొక్కలను ఈ నర్సరీలో పెంచాలని ఆశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా మొక్కల సంరక్షణ బాధ్యత‌‌ను ఉన్నతాధికారులు ఒక అధికారికి అప్పజెప్పారు. బాధ్యతగా వ్యవహరించాల్సిన అధికారి నర్సరీ‌ని గాలికి వదిలి నిర్లక్ష్యం వ్యవరించారు. దీని మూలంగా నర్సరీలో పనిచేసే కూలీలు మొక్కలపై అత్యంత ప్రమాదకరమైన కలుపు మందు పిచికారీ చేశారు. దీనితో నర్సరీలో వివిధ దశల్లో ఉన్న వేల మొక్కలు మృత్యువాత పడ్డాయి. ఆశాఖ వచ్చే ఏడాది హరిత హారం లక్ష్యం నెరవేరకుండా పోయింది.

కలుపు మందులు నర్సరీలో వాడకూడదు

నర్సరీలో మొక్కల పెంపకం అత్యంత సన్నితంగా చేపట్టాలి. పసిపిల్లలను చూసుకుంటున్నట్లు మొక్కలను జాగ్రత్తగా పెంచాల్సి ఉంటుంది. ఎలాంటి నిర్లక్ష్యం జరిగినా మొక్కలన్ని మృత్యువాత పడతాయి. ఇలాంటి సున్నితమైన నర్సరీలో కలుపు నివారణ కోసం కూలీలను వాడాల్సి ఉంటుంది. అధికారులు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా అధిక రసాయనాలు కలిగిన కలుపు మందులు పిచికారీ చేస్తూ మొక్కల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.

గుట్టుచప్పుడు కాకుండా నివారణ చర్యల ఆంతర్యం ఏమిటో..?

ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చుచేసి అంత్యంత ప్రతిష్టాత్మకంగా నర్సరీల నిర్వహణ చేపట్టి హరితహారంతో పర్యావరణాన్ని పెంపొందించేందుకు చేస్తున్న ప్రయత్నాలను కొందరు అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. తిమ్మంపేట నర్సరీలో కలుపు మందు పిచికారీ వెనకాల అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఈ విషయం బయటకు పొక్కకుండా, గుట్టుచప్పుడు కాకుండా నివారణ చర్యలు చేపట్టడం వెనకాల ఆంతర్యం ఏమిటనే అనుమానం కలుగుతోంది. లక్షల రూపాయల నష్టం ఒక పక్క, లక్ష్యం నీరుగారేలా వ్యవహరించిన అధికారి నిర్లక్ష్యం ఇంకోపక్క ఉన్నాకానీ ఉన్నతాధికారులు ఎందుకు స్పందించడం లేదో అర్థం కావట్లేదు. ‘తిలాపాపం తలా పిడికెడు’ అన్నట్లు ఆ శాఖ అధికారుల తీరు విస్మయాన్ని కలుగజేస్తుంది.

Next Story

Most Viewed