ఒక్కరు మినహా.. ఆ ఊరిలో అందరికీ కొవిడ్

by  |
ఒక్కరు మినహా.. ఆ ఊరిలో అందరికీ కొవిడ్
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి, మళ్లీ పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా దేశాల్లో కొవిడ్ సెకండ్ వేవ్ మొదలవడంతో మళ్లీ లాక్‌డౌన్ విధించారు. తాజాగా హిమాచల్‌ప్రదేశ్‌, లాహౌల్ వ్యాలీలోని తొరంగ్ గ్రామంలో ఒక్కరికి తప్ప అందరికీ కొవిడ్ పాజిటివ్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

మొత్తంగా 42 మంది నివాసముండే తొరంగ్ లోయ ప్రాంతంలో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ జరిగి ఉండొచ్చని వైద్య నిపుణులు భావిస్తున్నారు. కాగా ఇటీవలే వారంతా ఓ రిలీజియస్ కార్యక్రమానికి వెళ్లొచ్చిన తర్వాత కొవిడ్ టెస్టులు చేయించుకున్నారు. ఈ టెస్టుల్లో 41 మందికి పాజిటివ్ రాగా, 52 ఏళ్ల భూషణ్ కుమార్‌కు మాత్రం నెగెటివ్ వచ్చింది. దాంతో లాహౌల్ వ్యాలీకి ప్రయాణికుల రాకపోకలను పూర్తిగా నిలిపేశారు.

గురువారం ఆ రాష్ట్రంలో 12 మంది కరోనాతో మృతి చెందగా, ఇప్పటివరకు కరోనా మృతుల సంఖ్య 481కు చేరింది. 796 కొత్త కేసులు నమోదు కావడంతో కేసుల సంఖ్య మొత్తంగా 32,198కు చేరుకుంది.

Next Story

Most Viewed