ప్లాస్టిక్ వేస్ట్‌తో మ్యూజిక్ ఎక్విప్‌మెంట్స్.. అదరగొడుతున్న బ్యాండ్

by  |
Turkish-band-using-plastic-
X

దిశ, ఫీచర్స్ : ప్రాణకోటికి, ప్రకృతికి ముప్పుగా పరిణమించిన ‘ప్లాస్టిక్’‌‌ను నిషేధించాలని పర్యావరణవేత్తలు ఉద్యమిస్తున్నా ఫలితం మాత్రం శూన్యం. అయితే ఎన్విరాన్‌మెంటల్ లవర్స్ మాత్రం ప్లాస్టిక్‌ వ్యర్థాలను యథేచ్ఛగా పడేయకుండా, వాటిని పూల కుండీలుగా, హోమ్ డెకోరేటివ్ వస్తువులుగా మలుస్తున్నారు. టైర్లను కూడా కుర్చీలు, సోఫాలుగా మార్చేయడంలో తమ సృజనాత్మకతను చాటుకుంటున్నారు. ఇంకొంతమంది ప్లాస్టిక్ రీసైకిల్ చేసి వివిధ వస్తువులు తయారుచేస్తున్నారు. ఈ క్రమంలోనే టర్కీలోని ఇస్తాంబుల్‌కు చెందిన ‘ఫంగిస్తాంబు‌ల్’ మ్యూజిక్ బ్యాండ్ టీమ్ మెంబర్స్ డిస్‌కార్డెడ్ ప్లాస్టిక్‌ డబ్బాలతో గిటార్, డ్రమ్ రూపొందిచారు. ఈ వాయిద్యాలను ఉపయోగించి, పర్యావరణ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు ఓ మ్యూజిక్ వీడియో విడుదల చేశారు.

‘ఫంగిస్తాంబు‌ల్’ మ్యూజిక్ బ్యాండ్ సభ్యులు ప్లాస్టిక్ వ్యర్థపదార్థాలతో రూపొందించిన పరికరాలను ఉపయోగించి సంగీతం అందించడమే కాకుండా ఈ పరికరాల తయారీకి సంబంధించిన ప్రక్రియను కూడా డాక్యుమెంట్ రూపంలో రిలీజ్ చేశారు. గత ఐదేళ్లుగా తమ పాటల ద్వారా జనాల్లో పర్యావరణంపై అవగాహన కల్పి్స్తున్న ఈ మ్యుజిషియన్స్ ప్లాస్టిక్‌వేస్ట్‌తో తయారుచేసిన దుస్తులనే ధరించడం మరో విశేషం.2016లో ‘ఫెనాలజీ’ పేరుతో తొలి ఆల్బం విడుదల చేయగా.. ఇది మొక్కలు, జంతువుల లైఫ్ సైకిల్ ఇంపార్టెన్స్ గురించి వివరించింది. ఆ తర్వాత 2019లో ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల కలిగే నష్టాల గురించి ‘ట్రాష్ ఓరియెంటల్’ పేరుతో ఓ సాంగ్ విడుదల చేసిన ‘ఫంగిస్తాంబుల్’ బ్యాండ్.. తాజాగా ‘ట్రాష్ ఓరియెంటల్-2’ రూపొందించింది. ఈ వీడియో ఇప్పటికే నెటిజన్లను అమితంగా ఆకట్టుకోగా.. పర్యావరణ హితాన్ని కోరుతూ ఇప్పటివరకు 20 పాటలు అందించారు.

‘ప్రకృతి సమతుల్యతను మనం నాశనం చేసినప్పుడు, దాన్ని తిరిగి పొందడం చాలా కష్టం. అయితే సమాజంలో ఓ పౌరుడిగా పర్యావరణాన్ని కాపాడుకోవడం మన బాధ్యత. అందువల్లే వేస్ట్‌ను ది బెస్ట్‌గా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో సంగీత పరికరాలు తయారుచేస్తున్నాం. మన చుట్టూ ఉన్న వివిధ వస్తువుల నుంచి శబ్దాలను ఉత్పత్తి చేయడం ఓ అద్భుతం. దీన్నే ఫార్వార్డ్ ట్రాన్స్‌ఫర్‌మేషన్ అంటారు’ అని బ్యాండ్ సభ్యులు వివరించారు.



Next Story

Most Viewed