నేటి ప్రజా సంగ్రామ యాత్ర రూట్ మ్యాప్ ఇదే..!

by  |
Bandi2
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ చేపడుతున్న ప్రజాసంగ్రామ యాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఉదయం 10గంటలకు యాత్రను ప్రారంభిస్తారు. మొదట చార్మినార్ దగ్గర ఏర్పాటు చేసిన సభలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మొదటి విడత పాదయాత్ర అక్టోబర్ 2 వరకు నిర్వహించనుండగా, సెప్టెంబర్ 10 వరకు రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేశారు. మొదటి రోజు యాత్ర 10 కిలో మీటర్ల పాటు చేపట్టనున్నారు.

Bandi

మార్గ మధ్యలో పోలీస్ కంట్రోల్ రూం దగ్గర సర్ధార్ వల్లాబాయ్ పటేల్ విగ్రహానికి, గన్ పార్క్ వద్ద అమర వీరుల స్థూపానికి, అసెంబ్లీలో గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు అర్పించనున్నారు. తొలిరోజు మెహదీపట్నంలోని జి.పుల్లారెడ్డి ఫార్మసీ కళాశాల వరకు యాత్రను ముగించి అక్కడే ఏర్పాటు చేసిన క్యాంప్‌లో రాత్రి బస చేయనున్నారు. ఈ కార్యర్యక్రమానికి జాతీయ, రాష్ట్ర నేతలు హాజరుకానున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ స్టేట్ ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ బీసీ మోర్చ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, జాతీయ నాయకుడు పి.మురళీధర్ రావు, తమిళనాడు స్టేట్ కో ఇన్‌చార్జ్ సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్, ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎంపీ సోయమ్ బాపురావు, ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్ననున్నారు.

Bandi3

Next Story

Most Viewed