Syndicate Bank : జూన్ 30లోగా ఐఎఫ్ఎస్‌సీ కోడ్ అప్‌గ్రేడ్ తప్పనిసరి!

by  |
Syndicate Bank : జూన్ 30లోగా ఐఎఫ్ఎస్‌సీ కోడ్ అప్‌గ్రేడ్ తప్పనిసరి!
X

దిశ, వెబ్‌డెస్క్: సిండికేట్ బ్యాంకును కెనరా బ్యాంకులో విలీనం చేసినందున ఆ బ్యాంకుకు చెందిన ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌లు జులై 1 నుంచి నిలిచిపోనున్నాయి. ఈ నేపథ్యంలో సిండికేట్ బ్యాంకు వినియోగదారులు తమ బ్యాంక్ బ్రాంచ్ కొత్త ఐఎఫ్ఎస్‌సీ కోడ్ కోడ్‌లను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ మేరకు కెనరా బ్యాంకు ఖాతాదారులకు వెంటనే ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌లను అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. సిండికెట్ బ్యాంకు ఖాతాదారులందరూ జూన్ 30 లోగా తమ ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌ను మార్చుకోవాలని, దీనికి సంబంధించి ఇప్పటికే మేసేజ్‌ల రూపంలో సమాచారం ఇచ్చామని కెనరా బ్యాంకు వెల్లడించింది.

అలాగే, ఇకమీదట కస్టమర్లు నెఫ్ట్, ఆర్‌టీజీఎస్, ఐఎంపీఎస్ ద్వారా నగదును బదిలీ చేయాలంటే సీఎన్ఆర్‌బీతో ఉన్న ఐఎఫ్ఎస్‌సీ మాత్రమే ఉపయోగించాలని తెలిపింది. కాగా, 2019లో కేంద్రం బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు 10 ప్రభుత్వ రంగ బ్యాంకులు నాలుగు బ్యాంకులకు పరిమితం చేసేందుకు విలీన ప్రక్రియను మొదలుపెట్టింది. ఇది గతేడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి రాగా, అందులో భాగంగా సిండికేట్ బ్యాంకును కెనరా బ్యాంకులో విలీనం చేశారు.



Next Story

Most Viewed