ఇంతకీ అది ఔట్/ నాటౌట్.. అంఫైర్‌ నిర్ణయంపై ఇండియన్ ఫ్యాన్స్ ఫైర్

by  |
ఇంతకీ అది ఔట్/ నాటౌట్.. అంఫైర్‌ నిర్ణయంపై ఇండియన్ ఫ్యాన్స్ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్ : భారత్-ఇంగ్లాండ్ మధ్య అహ్మదాబాద్ లో నాలుగో టీ20 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో భారత బ్యా్ట్స్‌మెన్ సూర్య కుమార్ యాదవ్ ఔట్.. వివాదాస్పదంగా మారింది. సూర్య కుమార్ ఔట్ పై ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత ఇన్నింగ్స్ 14వ ఓవర్లో సామ్​ కర్రన్​ బౌలింగ్​లో సూర్య కుమార్ షాట్​కు ప్రయత్నించి మలన్​కు దొరికిపోయాడు. అయితే సూర్యకుమార్​ ఔట్​ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బంతిని చేతిలోకి తీసుకున్న తర్వాత మలన్​ దానిని నేలకు అంటించినట్లు కనిపించింది. అయితే చాలా సేపు రిప్లైలో చూసిన థర్డ్ అంపైర్.. చివరకు ఔట్ అని ప్రకటించారు.

అయితే రిప్లై వీడియోలో మాత్రం బాల్ గ్రౌండ్ ను తాకినట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. అయితే సూర్యకుమార్ ఔట్ పై భారత కెప్టెన్ విరాట్ కోహ్లీతో సహ ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాను ఆడిన మొదటి మ్యాచ్ లోనే సూర్య కుమార్ వచ్చిన అవకాశాన్ని యూస్ చేసుకున్నాడు. 3 సిక్సర్లు, 4 ఫోర్లతో ధనాధన్ అర్ధశతకం(57) సాధించాడు.

Next Story

Most Viewed