‌'కరోనా'ను గుర్తించడంలో థర్మల్ స్క్రీనింగ్ విఫలం

by  |
‌కరోనాను గుర్తించడంలో థర్మల్ స్క్రీనింగ్ విఫలం
X

న్యూఢిల్లీ: కరోనా రోగులను గుర్తించడంలో థర్మల్ స్క్రీనింగ్ అనుకున్న ఫలితాన్ని ఇవ్వడం లేదని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) ఫిబ్రవరిలోనే హెచ్చరించింది. ఈ మేరకు ఆ సంస్థ జర్నల్‌లో వచ్చిన ఓ కథనంలో ఈ విషయాన్ని వెల్లడించింది. మన దేశంలోని విమానాశ్రయాల్లో శరీర ఉష్ణోగ్రతల ఆధారంగా ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ చేపట్టగా, వారిలో 46 శాతం మంది బాధితులను థర్మల్ స్క్రీనింగ్ గుర్తించలేకపోయి ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. వ్యాధి లక్షణాలు తెలియకపోవడంతో చాలా మంది ప్రయాణికులు తప్పించుకుని ఉంటారని వెల్లడించింది. జనవరి 15న ఎయిర్ పోర్టుల్లో థర్మల్ స్క్రీనింగ్ చేపట్టకముందు 5,700 మంది విదేశాల నుంచి వచ్చారనీ, వారిలో కేవలం 17 మంది (0.3%)లో మాత్రమే కరోనా లక్షణాలు కనిపించడంతో ఆస్పత్రుల్లో చేరినట్టు ఐసీఎంఆర్ పేర్కొంది.

Tags: corona, thermal screening, airports, icmr

Next Story

Most Viewed