త్వరలో భారత్ కు చైనాతో అతి పెద్ద ముప్పు.. అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం..

by  |
త్వరలో భారత్ కు చైనాతో అతి పెద్ద ముప్పు.. అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం..
X

దిశ, వెబ్ డెస్క్ : చైనా చేస్తోన్న దురాగతాలు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదని, దాన్ని పూర్తిగా ఎప్పటికీ నమ్మలేమని, మన దేశానికి దాని నుంచి పెద్ద ముప్పు ఉందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ( Bipin Rawat) తెలిపారు. చైనా సరిహద్దుల దగ్గర మోహరించిన మన సైనికులను ఇప్పట్లో వెనక్కి రప్పించలేమని, చైనా దుందుడుకు వాదానికి చెక్ పెట్టాలంటే సైనికులు ఇంకా చాలా కాలం పాటు అక్కడే ఉండాల్సి వస్తుందని అన్నారు. ఎన్ని సమావేశాలు జరుగుతున్నా భారత్, చైనా సమస్యలకు పరిష్కారం దొరకడం లేదన్నారు. రెండు దేశాల మధ్య నమ్మకం లేక పోవడం, అనుమానాలు పెరుగుతూ ఉండటమే కారణమన్నారు.

భారత్ సైన్యం ఇప్పుడు ఎంతో శక్తి మంతంగా తయారైందని, ఎటువంటి సమస్యలను అయినా ధీటుగా ఎదుర్కొనగలమని తెలిపారు. అఫ్గాన్ లో తాలిబాన్ల ప్రభుత్వం ఏర్పడటం భారత్ కు పెద్ద ముప్పే అని స్పష్టం చేశారు. తాలిబాన్ల నుంచి కశ్మీర్ వేర్పాటు వాదులకు ఆయుధాలు అందితే అది మన దేశ భద్రతకు మరింత ముప్పు తెచ్చే అవకాశం ఉందన్నారు.

చైనా, భారత్ కు గత ఏడాది ఘర్షణలు జరిగాయి. అప్పుడు ఇరు దేశాలు పెద్ద సంఖ్యలో సైన్యాన్ని సరిహద్దులకు తరలించాయి. ఇరు సైన్యాలు వెనక్కి వెళ్లిపోవాలని ఇప్పటికి 13 దఫాలుగా చర్చలు జరిగినా పరిస్థితి లో ఏ మార్పూ రాలేదు. భవిష్యత్తులో ఇరు దేశాలు చాలా నష్టాన్ని ఎదుర్కోక తప్పదు అనే పరిస్థితులు కనిపిస్తున్నాయి.



Next Story

Most Viewed