కరోనా దెబ్బకు ఏపీలో మూసివేతల పర్వం

by  |
కరోనా దెబ్బకు ఏపీలో మూసివేతల పర్వం
X

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ ప్రభావంతో తిరుమల సహా రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల మూతపడనున్నాయి. అలాగే ప్రధాన ఆలయాల్లో నిత్యపూజలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. కరోనాపై మంత్రి ఆళ్లనాని మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుమలలో భక్తులకు అనుమతిని రద్దు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సినిమా హాళ్లు, మాల్స్ మూసివేయాలని ఆదేశించారు. ప్రజలు పెళ్లిళ్లు, ఫంక్షన్లు వాయిదా వేసుకుంటే బాగుంటుందన్నారు. ఐటీ ఉద్యోగులు వీలైనంత త్వరగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని సూచించారు. వ్యాపార సంస్థలు కూడా రక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్రంలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆయన గుర్తుచేశారు. కరోనా నివారణకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటుందని ఆళ్లనాని చెప్పుకొచ్చారు. వైరస్‌పై ప్రజలు ఆందోళన చెందవద్దన్నారు. వైరస్ తగ్గుముఖం పట్టే వరకు రాష్ట్ర ప్రజలు వైద్య ఆరోగ్య శాఖ సూచనలు తప్పకుండా పాటించాలని మంత్రి ఆళ్ళనాని ఈ సందర్భంగా తెలియజేశారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు విదేశాల నుంచి వచ్చే వారికి స్ర్కీనింగ్ టెస్టులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ఇటువంటి సమయంలో విపక్షాలు ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి ఆళ్లనాని కోరారు.

Tags: carona effect, Movie halls, malls, closed, alla nani, ap


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story