లిఫ్ట్ ఇస్తామని బెదిరించి…

by  |
లిఫ్ట్ ఇస్తామని బెదిరించి…
X

దిశ, విశాఖపట్నం: విశాఖలో ఘరానా మోసం చోటుచేసుకుంది. నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న ఓ వ్యక్తికి లిఫ్ట్ ఇస్తామని చెప్పి, ముగ్గురు యువకులు దోపిడీకి పాల్పడ్డారు. డీసీపీ సురేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం… పట్టణంలో కార్‌షెడ్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి వైజాగ్‌లో బస్ దిగి, ఆటోలో కార్‌షెడ్ వరకు వచ్చాడు. అనంతరం అక్కడి నుంచి వుడా హరిత అపార్ట్‌మెంట్‌లో ఉన్న తన ఫ్లాట్‌కు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో పాత పోలీస్ స్టేషన్ ప్రాంతంలో గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తులు అతన్ని గమనించారు. మెల్లగా అతని వద్దకు వాహనంతో వచ్చి లిఫ్ట్ ఇచ్చి డ్రాప్ చేస్తామని మాయమాటలు చెప్పారు.

అయినా అతను తిరస్కరించాడు. ఎంతకీ వాహనం ఎక్కకపోవడంతో అతన్ని బెదిరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే అతని వద్ద ఉన్న సెల్‌ఫోన్, నగదు దోపిడీ చేసి పరారయ్యారు. దీంతో హుటాహుటిన బాధితుడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. అనంతరం వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు. ఇప్పటికే ఆ ముగ్గురిలో ఒకరిపై గతంలో గంజాయి కేసు ఉందని పోలీసులు తెలిపారు. సీఐ సూరినాయుడి ఆధ్వర్యంలో ఎస్ఐ అప్పారావు వారిని అదుపులోకి తీసుకుని సెల్ ఫోన్, నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను పోలీస్టేషన్‌కు తరలించారు.



Next Story

Most Viewed