గ్రేటర్‌లో ఖాతా తెరవని టీడీపీ

by Shyam |
TDP logo
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ ప్రభావం పూర్తిగా కోల్పోయింది. గ్రేటర్ ఎన్నికల్లో మొత్తం 106 డివిజన్లలో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ, ఒక్క డివిజన్‌లో కూడా విజయం సాధించలేకపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో సుమారు 14 ఏండ్ల పాటు అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ 2016 ఎన్నికల్లో ఒకే ఒక డివిజన్‌లో గెలవగా, తాజా ఎన్నికల్లో అది కూడా కోల్పోయింది. టీడీపీ పక్షాన పోటీ చేసిన అభ్యర్థుల విజయం కోసం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గానీ, రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ కూడా ప్రచారం నిర్వహించకపోవడం గమనార్హం.Next Story

Most Viewed