గణేష్ నిమజ్జనాల పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీం : తలసాని

by  |
Ganesh Immersions
X

దిశ, డైనమిక్ బ్యూరో : హుస్సేన్ సాగర్‌లో పీఓపీ విగ్రహాల నిమజ్జనం చేయొద్దని హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్‌ను విచారణకు స్వీకరించిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పును గౌరవిస్తున్నామని, నిమజ్జనాల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తు్న్నామని వెల్లడించారు. కానీ నగరంలో దాదాపు 90 శాతం పీఓపీ విగ్రహాలే ఉన్నాయని, నిమజ్జనాలకు అనుమతివ్వకపోవడంతో తీవ్ర గందరగోళం ఏర్పడుతుందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా మరొక రోజులో వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

అంతేకాకుండా ట్యాంక్ బండ్ సహా గ్రేటర్ పరిధిలో ఉన్న చెరువుల్లో నిమజ్జనానికి ఏర్పాట్లు చేశామని చెప్పారు. అయితే గణేష్ నిమజ్జనం హుస్సేన్ సాగర్‌లోనే చేస్తామని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు తెలిపారు. గణేషుల నిమజ్జనాలకు ఏర్పాట్లు చేసే బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిదేననిని స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన మంత్రి తలసాని.. ఖచ్చితంగా నిమజ్జనం చేస్తామనటం ఉత్సవ సమితి అభిప్రాయం మాత్రమేనని, దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.



Next Story

Most Viewed