బతికి వస్తాడనుకున్నారు.. కానీ చివరికి అలా చిక్కాడు

by  |
బతికి వస్తాడనుకున్నారు.. కానీ చివరికి అలా చిక్కాడు
X

దిశ, సిరిసిల్ల: మానేరు నదిలో గల్లంతైన వారిలో ఆరో మృత దేహం ఆచూకి లభ్యం అయింది. మానేరు వంతెన కింద నీటిపై శవం తేలియాడడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు, గజ ఈత గాళ్లు రంగంలోకి దిగారు. మృతదేహాన్ని బయటకు తీసేందుకు వీరు నదిలోకి వెళ్తున్నారు. మంగళవారం కొనసాగిన సెర్చింగ్ ఆపరేషన్‌లో ఐదు డెడ్ బాడీస్ లభ్యం కాగా సింగం మనోజ్ ఆచూకి దొరకలేదు.

గల్లంతైన ఆ ఆశ..

ఈత కొట్టేందుకు మానేరు నదికి వెళ్లిన ఆరుగురు విద్యార్థుల్లో ఒకరి మృతదేహం దొరకకపోవడంతో అతను భయపడి పరార్ అయి ఉంటాడన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఒక వేళ ఇదే నిజమైతే తమ బిడ్డ ప్రాణాలతో ఉండి ఉంటాడన్న ఆశ బాధిత కుటుంబ సభ్యుల్లో రేకెత్తింది. కానీ అనూహ్యంగా బుధవారం వేకువ జామున సింగం మనోజ్ డెడ్ బాడీ కూడా దొరకడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఇంటర్ చదువుతున్న తమ కుమారుడు మరో నాలుగైదు ఏళ్లలో ప్రయోజకునిగా మారి తన కాళ్లపై తాను నిలబడుతాడని కలల కన్నారు. అయితే అతను కూడా విగతజీవీగా మారిపోయాడన్న విషయం తెలిసి వారి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed