సింగపూర్ లో ఒమెక్రాన్ కేసులు.. బూస్టర్ డోసులే కారణం.. ?

by  |
సింగపూర్ లో ఒమెక్రాన్ కేసులు.. బూస్టర్ డోసులే కారణం.. ?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచానికి పెను సవాలుగా మారిన ఒమెక్రాన్ ఇప్పుడు సింగపూర్ తీరాన్ని తాకింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ? కరోనాను ఎదుర్కోందాం అని బూస్టర్ డోస్ తీసుకుంటే.. పరీక్షల్లో ఒమెక్రాన్ ఉందని తేలింది. సింగపూర్ ఎయిర్ పోర్ట్ ప్యాసింజర్ సర్వీస్ వర్కర్ గా పని చేస్తున్న మహిళకు ఒమెక్రాన్ పాజిటివ్ వచ్చింది. అసలు ఎలా సోకిందని ఆరా తీయగా అసలు విషయం బయట పడింది. అయితే సింగపూర్ లో బయట పడిన మొదటి ఒమెక్రాన్ కేసు ఇదే అని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఇతర దేశాల నుంచి సింగపూర్ కు తిరిగి వచ్చిన ఓ యువకుడికి కూడా పాజిటివ్ వచ్చింది.

అతడు కూడా బూస్టర్ డోసు తీసుకున్నాడని, తర్వాతే ఒమెక్రాన్ గా తేలిందని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సింగపూర్ కు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ ఇన్ఫెక్షన్ డిసీజెస్ లో ఈ వేరియంట్ సోకిన ఇద్దరు వ్యక్తులు కోలుకుంటున్నారని సింగపూర్ తెలిపింది. ట్రేసింగ్ లో భాగంగా వీరిద్దరూ ఎవరెవరిని కలిశారో కనిపెట్టామని, వాళ్లందరినీ నిర్భంధంలో ఉంచినట్టు తెలిపారు. సింగపూర్ వ్యాప్తంగా మోడెర్నో, ఫైజర్ వ్యాక్సిన్ లు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు 96.2 శాతం మందికి వ్యాక్సిన్ లు వేశారు.

Next Story

Most Viewed