మొరాయిస్తున్న నిజాం సాగర్ గేటు

by  |
మొరాయిస్తున్న నిజాం సాగర్ గేటు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఉమ్మడి జిల్లా వరప్రదాయని నిజాం సాగర్ ప్రాజెక్ట్ గేట్ల మొరాయింపు షురూ అయింది. నిజాం సాగర్ కి వరద ఉధృతి తగ్గింది. 8 గేట్లు మూసేందుకు అధికారుల ప్రయత్నం చేస్తున్నారు. అయితే తొమ్మిదో నంబర్ గేటు క్లోస్ చేయలేక అధికారుల ఇక్కట్లు పడుతున్నారు. 3 వేల క్యూసెక్కుల నీళ్లు వృధాగా దిగువకు విడుదల అవుతున్నాయి. గతేడాది కూడా ఇలానే గేట్లు మొరాయించాయి. ప్రస్తుతం నిజాం సాగర్ కు 11,900 క్యూసెక్కుల వరద వస్తుంది. ప్రాజెక్ట్ లో 17,802 టీఎంసీలకు 16.964 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ఉదయం ప్రాజెక్ట్ కు 42 వేల క్యూసెక్కుల ఇన్ ప్లో రాగా.. 44,640 క్యూసెక్కులు దిగువ కు వదిలారు. 7 గంటల సమయంలో 22,900 క్యూసెక్కుల వరద రాగానే 2,3,6,9 గేట్ల ద్వారా 20 వేలు, ఎస్కేప్ గేట్ల ద్వారా 2000 దిగువకు వదిలారు. 10 గంటల నుంచి 11900 క్యూసెక్కుల వరద రావడంతో గేట్లను మూసి వేసేందుకు యత్నించగా.. 9వ గేట్ మొరాయించింది.



Next Story

Most Viewed