ఎంపీ రఘురామ ఎఫెక్ట్: జగన్ ప్రభుత్వంపై ఎన్‌హెచ్‌ఆర్సీ ఆగ్రహం

by  |
nhrc news
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై జాతీయ మానవ హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అంశంలో డీజీపీకి మరోసారి సమన్లు జారీ చేసింది. ఎంపీ రఘురామ అరెస్ట్ వ్యవహారంపై నివేదిక పంపాలని నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే ఎంపీ రఘురామ అరెస్ట్‌పై నోటీసులు పంపించినా ప్రభుత్వం స్పందించకపోవడంతో మంగళవారం జాతీయ మానవ హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. నివేదిక ఇవ్వడంలో ఎందుకు జాప్యం అవుతుందో చెప్పాలని ఏపీ అధికారులను నిలదీశారు. ఆగస్టు 9 లోపు నివేదిక ఇవ్వాలని తాజాగా ఎన్‌హెచ్‌ఆర్సీ ఆదేశాలు జారీ చేసింది. గడువులోగా నివేదిక ఇవ్వకపోతే ఆగస్టు 16న వ్యక్తిగతంగా హాజరు కావాలని ఏపీ డీజీపీని హెచ్చరించింది.

Next Story

Most Viewed