బ్రేకింగ్: మహిళా కార్పొరేటర్‌కు వార్నింగ్ ఇచ్చిన మేయర్ భర్త

by  |
meerpet mayor
X

దిశ, జల్​పల్లి : ఏం తమాషాలు అయితున్నయా మీ అందరికి ..? నేను చెబుతున్నా కదా? మేయర్​ రాదు..? ఇక్కడికి రాదంటే రాదు.. ? మీరు ఇక్కడికి రావద్దు ? ఆఫీసర్​ల దగ్గర పోయి కూర్చో? అర్జెంట్​ అయితే ఇంటికి తొలుకుపోతా ? సోమవారం, బేస్తవారం మాత్రమే మేయర్ చాంబర్​కి వస్తది… మిగతదంతా నేనే చూసుకుంటా? అంటూ సమస్యల పరిష్కారానికి వచ్చిన 29వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ ​నీలా రవినాయక్ ​దంపతులకు ఎదురైన చేదు అనుభవమిది.. ఇదంతా సాక్షాత్తు మీర్​పేట్ ​మున్సిపల్ ​కార్పొరేషన్ మేయర్ ​భర్త దీప్​లాల్ ​చౌహాన్ తోటి మహిళా కార్పొరేటర్ ​అని చూడకుండా ఆగ్రహంతో ఊగిపోతూ నోటి దురుసును ప్రదర్శించడం వివాదస్పదంగా మారింది. మేయర్ ​సీటులో నువ్వెందుకు కూర్చున్నావ్​ అని ఆ మహిళా కార్పొరేటర్​ నిలదీయడంతో నా ఇష్టం అడగడానికి నువ్వెవరు ? అంటూ మేయర్ ​భర్త మండిపడ్డ వ్యవహారమంతా సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. మేయర్​ భర్తపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ నాయకులు డిమాండ్ ​చేస్తున్నారు.

వివరాలలోకి వెళితే.. ఆమె ఒక మీర్​పేట్​ మున్సిపల్ ​కార్పొరేషన్​ మేయర్ ​దుర్గ.. తమ డివిజన్​లో ప్రోటోకాల్ ​పాటించకుండా.. కార్పొరేటర్​కు చెప్పకుండా కోఆప్షన్ ​మెంబర్​తో శంకుస్థాపనలు ఎలా చేస్తారంటూ మేయర్ చాంబర్​కు వచ్చిన 29వ డివిజన్ కార్పొరేటర్ ​నీలా రవినాయక్​ దంపతులకు మేయర్​చాంబర్​లో మేయర్​ కోసం ఏర్పాటు చేసిన సీటుపై ఆమె భర్త దీప్​లాల్​ చౌహాన్​ కూర్చొని ఉండడం కనిపించింది. దీంతో మా డివిజన్​లో సమస్యలు ఉన్నాయని, 29 వ డివిజన్​లో అభివృద్ది పనుల నిమిత్తం మంజూరయిన నిధులను 11వ డివిజన్​కు ఎలా మళ్లిస్తారని? ఎప్పుడు వచ్చినా మేయర్​ కనిపిస్తలేదని ప్రశ్నించారు. ఆమె సీటులో ఎప్పుడు మీరే కనిపిస్తారు? అసలు మేయర్​ ఎక్కడా..? మేయర్​ సీటులో మీరు ఎందుకు కూర్చున్నారని అని నిలదీసిన కార్పొరేటర్ ​నీలా రవినాయక్​పై మేయర్​ భర్త దీప్​లాల్​ చౌహాన్​మండిపడ్డాడు. మేయర్​ రాదు ఇక్కడికి అంటూ విరుచుకుపడ్డాడు. ఏదన్న ఉంటే మేయర్​ తో మాట్లాడు.. ఇంటికి తొలుకపోతా ? అంటూ చాంబర్ ​నుంచి వెళ్లగొట్టరాని సదరు మహిళా కార్పొరేటర్ ​వాపోయింది. మేయర్ ​ఇంటికి మేము ఎందుకు పోతం..? ఆమె భర్తకు ఇక్కడ ఎం పని.? సాటి మహిళా మంత్రి గా ఉన్న సబితా ఇంద్రారెడ్డి వెంటనే స్పందించాలని డిమాండ్​ చేశారు.

ప్రజలకు అందుబాటులో లేని మేయర్​ను బర్తరఫ్​ చేయాలే

మహిళా కార్పొరేటర్​లను అగౌరవపరచడం మంత్రులకు, మేయర్​ భర్తలకు అలవాటయ్యిందని ఈ విష సంస్కృతిని మానుకోవాలని వెంటనే మేయర్​ భర్తపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ మాజీ సింగల్​విండో చైర్మన్ కొలన్​ శంకర్​రెడ్డి ​డిమాండ్​ చేశారు. ప్రజలకు అందుబాటులో లేని మేయర్​ను మేయర్​ పదవి నుంచి వెంటనే తొలగించాలని, లేక పోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.

Next Story

Most Viewed