మీడియా రిపోర్టులతో ఈసీకి అప్రతిష్ట

by  |
Madras High Court
X

చెన్నై: మద్రాస్ హైకోర్టు ఎన్నికల సంఘంపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు మీడియా రిపోర్టు చేసి రాజ్యాంగబద్ధ సంస్థ ప్రతిష్టను మసకబార్చిందని ఈసీ పేర్కొంది. రోజువారీగా కోర్టులు చేసే మౌఖిక వ్యాఖ్యలను రిపోర్టు చేయకుండా మీడియాపై ఆంక్షలు విధించాలని మద్రాస్ హైకోర్టును ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేసింది. కరోనా కేసుల పెరుగుదలకు ఈసీని బాధ్యత చేస్తూ దానిపై మర్డర్ కేసు పెట్టాలని మద్రాస్ హైకోర్టు ఇటీవలే వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలు మీడియాలో విరివిగా రిపోర్ట్ అయ్యాయి. మీడియా రిపోర్టులపై ఈసీ కలతచెంది తాజాగా మద్రాస్ హైకోర్టుకు చేరింది. రాజ్యాంగబద్ధ బాధ్యతలు కలిగిన స్వతంత్ర ఏజెన్సీ ఎన్నికల సంఘం ప్రతిష్టను మీడియా రిపోర్టులు మసకబార్చాయని హైకోర్టులో తన పిటిషన్‌లో ఈసీ పేర్కొంది. రాజకీయ నాయకులే తమ బాధ్యతలు నిర్వర్తించడం విఫలమయ్యారని వివరించింది. మీడియా సంస్థలు హైకోర్టు ధర్మాసనం చేసే మౌఖిక వ్యాఖ్యలను రిపోర్ట్ చేయకుండా న్యాయస్థానం ఆదేశించాలని కోరింది. కేవలం ఆర్డర్ కాపీలో పేర్కొన్న వివరాలనే మీడియా ప్రచురించాలని తెలిపింది. ఈ పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం వాదనలు వినబోతున్నది.


Next Story

Most Viewed