వెంటనే విచారణ చేపట్టండి.. ఎస్పీకి ఆదేశం

by  |
వెంటనే విచారణ చేపట్టండి.. ఎస్పీకి ఆదేశం
X

దిశ, ఆదిలాబాద్: ఓ భూవివాదంలో డీఎస్పీ, సీఐలు ఏక పక్షంగా ఒక వర్గానికి సహకరిస్తూ తనకు అన్యాయం చేస్తున్నారని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. వెంటనే ఈ విషయంపై విచారణ జరిపి ఆగస్టు 5వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని ఆ జిల్లా ఎస్పీని ఆదేశించింది. ఆసిఫాబాద్ జిల్లా, అదే మండలం మాలన్ గొంది గ్రామానికి చెందిన కుడిమెత శంకర్ కు అదే గ్రామానికి చెందిన మరో ముగ్గురి మధ్య కొన్నిరోజుల నుంచి భూవివాదం కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో శంకర్ తండ్రి గతంలో హత్యకు గురయ్యాడు. కాగా, ఈ విషయంలో ఆసిఫాబాద్ డీఎస్పీ, సీఐలు అవినీతికి పాల్పడుతూ తన ప్రత్యర్థులకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ ఆయన మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మానవ హక్కుల కమిషన్ జ్యుడిషియల్ సభ్యులు ఈ వ్యవహారంపై ఆగస్టు 5వ తేదీలోగా సమగ్ర నివేదిక అందజేయాలని ఆసిఫాబాద్ ఎస్పీని ఆదేశించారు.

Next Story

Most Viewed