రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఆ ఖర్చంతా ప్రభుత్వానిదే!

by  |
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఆ ఖర్చంతా ప్రభుత్వానిదే!
X

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రైతులకు అనుకూల నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో డీఏపీ ఫెర్టిలైజర్‌ ధర భారీగా పెరగడంతో ఆ మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని నిర్ణయించింది. ఈ మేరకు డీఏపీపై 140శాతం సబ్సిడీని పెంచింది. రైతులకు పాత ధర రూ. 1200కే అందించాలన్న ఈ నిర్ణయంతో కేంద్రానికి అదనంగా రూ. 14,775కోట్ల భారం పడనుంది. గతంలో డీఏపీ బ్యాగ్ ధర రూ. 1700 ఉండగా అందులో రూ. 500ను కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కింద భరించింది. దీంతో కంపెనీలు రైతులకు రూ. 1200కే డీఏపీని అందించాయి. తాజాగా, అంతర్జాతీయ మార్కెట్‌లో రేట్లు చుక్కలనంటడంతో సబ్సిడీ మొత్తాన్ని రూ. 500 నుంచి రూ. 1200కు పెంచింది. అంటే దాదాపు 140శాతం సబ్సిడీని పెంచింది. సబ్సిడీ పెంపుతో రైతులకు డీఏపీ బ్యాగ్ పాత ధర రూ. 1200కే అందుబాటులో ఉంటాయని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఏకకాలంలో సబ్సిడీని ఇంత మొత్తం పెంచడం చారిత్రాత్మకమని తెలిపింది.

Next Story

Most Viewed