ముగిసిన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు

by  |
ముగిసిన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు
X

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్​ – రంగారెడ్డి– మహబూబ్​ నగర్​ ఎమ్మెల్సీ స్థానంలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. 9 జిల్లాల పరిధిలో నమోదైన ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన పనులు ఆలస్యమయ్యాయి. దీంతో గురువారం అదనంగా 112 మందిని విధుల్లోకి ఓట్ల లెక్కింపును చేపట్టారు, 56 టేబుళ్లపై ఏడు రౌండ్లలో 3,58,348 ఓట్లను అధికారులు లెక్కించగా.. ఇందులో 21,309 ఓట్లు చెల్లుబాటు కాలేదని అధికారులు ప్రకటించారు. మిగిలిన 3,37,039 ఓట్లలో 1,68,520 ఓట్లు వచ్చిన వారిని విజేత అవుతారు.

అయితే స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శించకపోయిన మొదటి ప్రాధాన్యత ఓట్లలో అత్యధికంగా టీఆర్ఎస్​ అభ్యర్థి వాణిదేవికి 1,12,689 ఓట్లు రాగా, సమీప బీజేపీ అభ్యర్థి రాంచందర్​ రావుకు 1,04,668 ఓట్లు వచ్చాయి. మూడో స్థానంలో ప్రొఫెసర్​ నాగేశ్వర్​ రావు 53,610 ఓట్లతో, చిన్నారెడ్డి 31,554 ఓట్లతో ఉన్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాని నేపథ్యంలో అభ్యర్థుల ఎలిమినేషన్​ ప్రక్రియలో రెండో ప్రాధాన్యత ఓట్ల ద్వారా గెలిచేదెవరో నిర్ణయించనున్నారు. ఈ స్థానంలో 93 మంది అభ్యర్థులు పోటీ చేయగా.. 52 మందికి 100 ఓట్లు, 29 మందికి 500లోపు, ఇద్దరికి వెయ్యి లోపు ఓట్లు వచ్చాయి. అతి తక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థుల్లోని రెండో ప్రాధాన్యత ఓట్లను మిగిలిన అభ్యర్థులకు కేటాయించడం ద్వారా ప్రక్రియను ముందుకు కొనసాగించనున్నారు.

అభ్యర్థి రౌండ్​– 1 2 3 4 5 6 7 మొత్తం
TRS 17,439 17,732 17,836 17,545 17,40 6 6,979 1,12,689
CONG 5,082 4,980 4,973 5,018 4,387 5,187 1,927 31,554
BJP 16,385 16,173 16,005 16,436 16,750 16,335 6,584 1,04668
Nagewar 8,357 8,594 8,554 8,524 8,575 7,846 3,160 53,610


Next Story

Most Viewed