మానవత్వం చాటిన ఏనుగు.. తోండం పైకెత్తి నివాళులు

by  |
మానవత్వం చాటిన ఏనుగు.. తోండం పైకెత్తి నివాళులు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో మనషుల్లో మానవత్వం తగ్గుతోంది. బిజీ లైఫ్‌లో, పని ఒత్తిడిలో పక్కవారి గురించి పట్టించుకునే సమయం కూడా లేకుండా పోయింది. సమయం ఉన్నా.. తమ కుటుంబం గురించి తప్పితే పక్కవారి గురించి ఆలోచించేవారు చాలా తక్కువ. పక్కవారి కష్టాలు గురించి, ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేందుకు సొంత బంధువులే ముందుకు రావడం లేదు. తాము బాగుంటే చాలు.. పక్కవాడు ఏమైతే పనకేంటి అనే ధోరణి ప్రస్తుత సమాజంలో చాలామందిలో కనిపిస్తోంది. మనిషిలో స్వార్థం బాగా పెరిగిపోతోంది. కరోనా టైమ్‌లో సొంత ఇంట్లోని కుటుంబసభ్యుడు చనిపోతేనే.. అంత్యక్రియలు నిర్వహించేందుకు ఇంట్లోవాళ్లే ముందుకు రాని పరిస్థితి. దీనిని బట్టి చూస్తే.. సమాజంలో మానవ సంబంధాలు ఏ మేరకు దెబ్బతిన్నాయో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.

అయితే మనుషులే మానవత్వం చూపని ఈ రోజుల్లో… ఒక మూగజీవి మానవత్వాన్ని చాటుకుంది. మనషుల్లోనే కాదు.. తమలోనూ మానవత్వం ఉందని నిరూపించింది ఓ ఏనుగు. తన బాగోగులు చూసుకునే వ్యక్తి చనిపోయాడని తెలుసుకుని కన్నీళ్లు పెట్టుకుంది. బాధతో నివాళులు అర్పించింది. కరోనా సమయంలో సొంత కుటుంబంలోని వ్యక్తి చనిపోతేనే.. మిగతా కుటుంబసభ్యులు రాని ప్రస్తుత పరిస్థితుల్లో ఈ గజరాజు చూపిన మానవత్వం అందరినీ ఆకట్టుకుంటోంది.

పల్లట్టు బ్రహ్మదాథన్ అనే ఈ ఏనుగు బాగోగులను మావటి కున్నక్కాడ్ దామోదరన్ నాయర్ అనే వ్యక్తి గత కొంతకాలంగా చూసుకుంటున్నాడు. అయితే అనారోగ్య కారణాలతో ఆయన ఇటీవల కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న ఏనుగు.. మృతదేహాం దగ్గరికి వచ్చి దామోదరన్ నేర్పించిన విద్య ప్రకారమే తుది నివాళి అర్పించింది. కళ్లు నీళ్లు చెమర్చుతుండగా తొండం పైకెత్తి దండం పెట్టింది. ఇది చూసి దామోదరన్ కుమారుడు రాజేశ్ ఆ ఏనుగు వద్దకు వచ్చి హత్తుకున్నాడు. దాని తొండంపై వాలి తన గుండెలోని భారాన్ని కొంత దించుకునే ప్రయత్నం చేశాడు. ఈ ఘటన ఈనెల 3న జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Next Story

Most Viewed