కరోనా టీకాల ధరలివే.. ఫైనల్ చేసిన కేంద్రం

by  |
కరోనా టీకాల ధరలివే.. ఫైనల్ చేసిన కేంద్రం
X

న్యూఢిల్లీ: కరోనా వైరస్ టీకా ధరలపై కేంద్ర ప్రభుత్వం పరిమితిని విధించింది. ప్రైవేటు హాస్పిటళ్లలో భారీగా వసూళ్లు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో సర్వీసు చార్జీపై లిమిట్ విధిస్తూ ఓ ప్రకటన వెలువరించింది. టీకా కంపెనీలు కొవిషీల్డ్ డోసుకు రూ. 600, కొవాగ్జిన్ డోసుకు రూ.1200, స్పుత్నిక్ వీ డోసుకు రూ. 948 ప్రకటించాయని(టీకా కేంద్రాలకు చేరే వరకూ ఖర్చు కలుపుకుని) వివరించింది. వీటిపై వరుసగా జీఎస్టీ రూ. 30, రూ. 60, రూ. 47లు పడుతుందని తెలిపింది. ఈ మూడు టీకాల పంపిణీకి సర్వీసు చార్జీ గరిష్టంగా రూ. 150 తీసుకోవాలని ప్రైవేటు హాస్పిటళ్ల టీకా కేంద్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశించింది. తద్వారా కొవిషీల్డ్ డోసు గరిష్టంగా రూ.780, కొవాగ్జిన్ గరిష్ట ధర రూ. 1410, స్పుత్నిక్ వీ గరిష్ట ధర రూ. 1145గా ఉంటుందని తెలిపింది.



Next Story

Most Viewed