ఆ పనికి ఒప్పుకోని ప్రియురాలు.. తగులబెట్టిన ప్రియుడు

by  |
ఆ పనికి ఒప్పుకోని ప్రియురాలు.. తగులబెట్టిన ప్రియుడు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రియురాలు దూరం పెట్టిందన్న కోపంతో ప్రియుడు దారుణానికి ఒడిగట్టాడు. పెట్రోల్ పోసి తగులబెట్టి హత్య చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ జిల్లా కూకట్‌పల్లిలోని ప్రశాంత్‌నగర్‌లో కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాచారం ఈఎస్‌ఐ ఆస్పత్రిలో పని చేస్తున్న వెంకటలక్ష్మీకి.. వెంకటేశ్వర్లుతో పరిచయం కాస్తా సహజీవనానికి దారి తీసింది. ఈ క్రమంలో ఇరువురి మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగా ప్రియుడిని దూరం పెట్టేసింది.

ఆనాటి నుంచి వెంకటలక్ష్మీపై కోపం పెంచుకున్న ప్రియుడు ఆమెను హత్య చేసేందుకు పథకం వేసుకున్నాడు. బుధవారం రాత్రి ఒంటరిగా ఉందని గమనించి ఇంట్లోకి వచ్చి తగులబెట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కి చేరుకుని బాధితురాలిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే తీవ్రగాయాలు కావడంతో వెంకటలక్ష్మీ మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. ఇక దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Next Story