ఆగస్టులోనే విద్యాసంవత్సరం ప్రారంభం..

by  |
ఆగస్టులోనే విద్యాసంవత్సరం ప్రారంభం..
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2021-22 విద్యా సంవత్సరాన్ని ఆగస్టు 2వ వారం నుంచి ప్రారంభిస్తామని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. ప్రత్యక్ష తరగతులు జరిగే అవకాశం లేనందును స్కూల్ ఫీజు 70శాతమే తీసుకోవాలని ఆయా పాఠశాలలు, కళాశాలలను ఆదేశించారు. టెన్త్, ఇంటర్ ఫలితాలపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ అంశంపై ఇప్పటికే రిటైర్డ్ ఐఏఎస్ ఆధ్వర్యంలో హైపవర్ కమిటీ వేసినట్లు ఆయన గుర్తు చేశారు. టెన్త్, ఇంటర్ ఫలితాలపై ఆ కమిటీ నివేదికలను పరిశీలనలోకి తీసుకుంటామన్నారు. నివేదిక వచ్చిన 2, 3 రోజుల్లో రిజల్ట్ ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు. మరోవైపు ఆగస్టులో సెట్ల పరీక్షలు యథావిధిగా జరుగుతాయని మంత్రి సురేశ్ తెలిపారు.



Next Story

Most Viewed