ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సమావేశానికి భార్యకు బదులు భర్త వస్తే అంతే..

by  |
ap-govt
X

దిశ, ఏపీ బ్యూరో: ప్రజా ప్రతినిధుల కుటుంబ సభ్యులు అధికారిక సమావేశాలలో, కార్యక్రమాలలో పాల్గొనడానికి వీలు లేదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అలా పాల్గొంటే క్రిమినల్ కేసులు నమోదు అవుతాయని హెచ్చరించింది.

ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ అధికారిక సమావేశాలలో ప్రజా ప్రతినిధుల బదులుగా భార్య, భర్త, కుటుంబ సభ్యులు, చుట్టాలు పాల్గొంటున్నారని.. అంతేకాకుండా పంచాయతీ రాజ్ వ్యవస్థకు సంబంధించిన నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారని ఇది చట్ట విరుద్ధమని పంచాయతీ రాజ్ శాఖ కమిషన్ స్పష్టం చేసింది.

ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు అధికారిక సమావేశాల్లో పాల్గొంటున్నారని తెలిస్తే సంబంధిత పంచాయతీ సెక్రటరీ, ఎంపీడీవో, డీపిఓ, జెడ్పీసీఈవోలపై కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ ప్రకారం చర్యలు ఉంటాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అలాగే రాష్ట్ర పంచాయతీ రాజ్ చట్టం 2018- సెక్షన్ 37(5) ప్రకారం (మహిళ) ప్రజా ప్రతినిధుల భర్త, కుటుంబ సభ్యులు, చుట్టాలపై క్రిమినల్ కేసులు నమోదు అవుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.



Next Story

Most Viewed