ప్రపంచానికి ఉగ్రముప్పు పొంచి ఉంది : ఐరాస

by  |

న్యూఢిల్లీ : ఓవైపు కరోనా మహమ్మారి ఉత్పాతాన్ని సృష్టిస్తుండగా.. మరోవైపు దాని నీడలోనే ఉగ్రముప్పు పొంచి ఉన్నదని ఐక్యరాజ్య సమితి(ఐరాస) హెచ్చరించింది. కరోనా లాక్‌డౌన్‌లనుతమకు అనుకూలంగా మార్చుకుని ఉగ్ర మూకలు ప్రాణాంతకమైన బయో ఉగ్రవాదానికి తెరలేపే అవకాశం ఉన్నదని యూఎన్ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తంచేశారు. కరోనా వైరస్‌ను ఉగ్రవాదులు బయో వెపన్‌గా ఉపయోగించుకునే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్ సంక్షోభంపై గురువారం డోమినికన్ రిపబ్లిక్ అధ్యక్షతన నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన ప్రసంగించారు. కరోనా మహమ్మారి తొలుత ఆరోగ్య సంక్షోభంగానే పరిణమించిందని.. కాని దీని కారణంగా పలు రంగాలు దెబ్బతిన్నాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం కరోనా అంతర్జాతీయ శాంతి, భద్రతలకు ముప్పుగా పరిణమించే అవకాశాలు ఉన్నాయని గుటెరస్ అభిప్రాయపడ్డారు. అదే జరిగితే ఈ అవకాశాన్నిఉగ్రసంస్థలు తమకు అనుకూలంగా మలుచుకుంటాయని.. ప్రపంచాన్ని నాశనం చేసేందుకు వాళ్లు కంకణం కట్టుకునే ముప్పు ఉన్నదని అన్నారు. ప్రస్తుతం అన్ని దేశాలు కరోనా కట్టడిపై దృష్టి సారించాయని.. ఈ సమయాన్ని ఉగ్రవాదులు తమ కార్యాకలాపాలు ఆటంకం లేకుండా సాగించేలా ప్రణాళికలు రచిస్తాయని ఆయన చెప్పారు. కాబట్టి కరోనాపై పోరాడుతూనే ఉద్రవాదంపై దృష్టిపెట్టాలని ఆయన చెప్పారు.

Tags:coronavirus, terrorism, threat, un, face, challenges



Next Story

Most Viewed