YS Vijayamma : వైసీపీకి విజయమ్మ రాజీనామా.. జగన్‌ ఎదుటే సంచలన ప్రకటన

by Disha Web Desk 2 |
YS Vijayamma Resigns to YSRCP Party to Support YS Sharmila
X

దిశ, వెబ్‌డెస్క్: YS Vijayamma Resigns to YSRCP Party to Support YS Sharmila| వైసీపీ ప్లీనరీ సమావేశంలో షర్మిల పార్టీపై విజయమ్మ కీలక వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి ఆశయాలను జనాల్లోకి తీసుకెళ్లేందుకు తన కూతురు షర్మిల పార్టీ స్థాపించి కష్టపడుతోందన్నారు. ఇక్కడ జగన్‌ను ఆశీర్వదించినట్లే, తెలంగాణలో షర్మిలను కూడా ఆశీర్వదించాలని కోరారు. తన అన్నకు ఇబ్బంది కలగకూడదని, తెలంగాణ కోడలిగా తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ పెట్టుకుందని చెప్పారు. తన తండ్రి ఆశయాలు నెరవేర్చాలని కంకణం కట్టుకుందని వ్యాఖ్యానించారు. ఈ మేరకే తెలంగాణలో గట్టి ప్రయత్నం చేస్తోందని అన్నారు. ఇక్కడ జగన్‌కు అక్కడ షర్మిలకు మద్దతు ఎలా ఇస్తారని చాలామంది రకరకాల ప్రచారాలు చేస్తున్నారని, షర్మిలకు అండగా ఉండాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు. అంతేగాక, ప్రస్తుత పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలిగా ఇక కొనసాగలేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో తన కూతురు అండగా ఉండాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు. తల్లిగా జీవితకాలం ఇద్దరికీ అండగా ఉంటానన్నారు.

Next Story

Most Viewed