అమ్మ అన్నం తినమన్నదని డిండిలో దూకిన కూతురు

by Gopi |
అమ్మ అన్నం తినమన్నదని డిండిలో దూకిన కూతురు
X

దిశ, డిండి: అమ్మ మందలించిందని చెరువులో మునిగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం... దేవరకొండ జంగాల కాలనీకి చెందిన కేతావత్ వసంత(23) బీటెక్ పూర్తి చేసింది. ఈ నెల 10న మధ్యాహ్నం అన్నం తినడంలేదని కన్నతల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన వసంత ఇంట్లో నుంచి వచ్చి డిండి డ్యాంలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఈ ఘటనపై తమకు ఎలాంటి అనుమానం లేదని మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

Next Story