భవిష్యత్తులో 'పూప్ బ్యాంక్స్' అవసరం : సైంటిస్ట్స్

by Nagaya |
భవిష్యత్తులో పూప్ బ్యాంక్స్ అవసరం : సైంటిస్ట్స్
X

దిశ, ఫీచర్స్ : మలాన్ని స్టోర్ చేస్తూ, మెటాముసిల్‌ స్టాక్ అప్ చేయాల్సిన అవసరముందని శాస్త్రవేత్తలు అంటున్నారు. దశాబ్ద కాలంలో మానవ గట్ మైక్రోబయోమ్స్(జీర్ణవ్యవస్థలోని బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు) ఎలా మారాయి అనే అంశంపై హార్వర్డ్ మెడికల్ స్కూల్, బ్రిఘం అండ్ ఉమెన్ హాస్పిటల్‌లోని పరిశోధకుల బృందం ట్రెండ్స్ ఇన్ మాలిక్యులర్ మెడిసిన్ జర్నల్‌లో ఒక అభిప్రాయ కథనాన్ని ప్రచురించింది. మైక్రోబయామ్స్‌లో వచ్చిన మార్పులు జీర్ణవ్యవస్థ వ్యాధి, అలెర్జీలు, టైప్ 2 డయాబెటీస్ పెరుగుదలకు కారణమయ్యాయి. కాబట్టి ఈ రుగ్మతలను ఎదుర్కునేందుకు ప్రజలు వ్యక్తిగత 'పూప్ బ్యాంక్స్' ప్రారంభించాలని పరిశోధకులు సూచిస్తున్నారు.

ఒక వ్యక్తి చిన్న వయసులో ఉన్నప్పటి నుంచే 'స్టూల్ శాంపుల్'(మల నమూన) సేవ్ చేయడం ద్వారా తర్వాత జీవితంలో మీ గట్ మైక్రోబయోటా మారినట్లయితే, ఆ మార్పుల వల్ల మీరు వ్యాధిని ఎదుర్కొంటే, మీరు ఆటోలోగస్ ఫీకల్ మైక్రోబయోటా ట్రాన్స్‌ప్లాంట్ (FMT) లేదా పూప్ ట్రాన్స్‌ప్లాంట్‌గా పిలువబడే చికిత్స చేయించుకోవచ్చు. ఉదాహరణకు ఎన్నో భయంకరమైన రోగాలను నయం చేసేందుకు, భవిష్యత్తు ఉపయోగాల కోసం ఎలాగైతే పేరెంట్స్ తమ బిడ్డ బొడ్డుతాడును స్టెమ్‌సెల్ బ్యాంక్స్‌లో స్టోర్ చేస్తున్నారో, రాబోయే కాలంలో 'ఆటోలోగస్ FMT' కోసం స్టూల్ బ్యాంకింగ్ ఆలోచన భవిష్యత్తులో సాధ్యమయ్యే అవకాశాలు తప్పక ఉన్నాయని పరిశోధకులు భావిస్తున్నారు. బొడ్డు తాడు రక్తం కంటే మలం నమూనాలను ఉపయోగించే వారి సంఖ్య పెరగనుందని హార్వర్డ్‌లోని మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్

యాంగ్-యు లియు పేర్కొన్నాడు.

క్లోస్ట్రిడియోయిడ్స్ డిఫిసిల్ (సి. డిఫ్) వంటి జీర్ణవ్యవస్థ వ్యాధులను సమర్థవంతంగా చికిత్స చేసేందుకు ముందు FMTలు ఉపయోగించబడ్డాయి. యాంటీబయాటిక్స్ ద్వారా మీ పేగులోని సూక్ష్మజీవులు నాశనమైనప్పుడు మీ పెద్దపేగుపై బ్యాక్టీరియా దాడి చేస్తుంది. రెజిమెంట్ సీ.డిఫ్‌కి చికిత్స చేయగలిగినప్పటికీ, అది నిరోధకంగా మారే అవకాశం ఉంది. అలాంటి సందర్భంలో వైద్యులు FMT వంటి ప్రత్యామ్నాయ చికిత్సలను ఉపయోగించవచ్చు. అయితే మలాన్ని సెలైన్ రూపంలోనే మన శరీరంలోకి ఇంజెక్ట్ చేస్తారు. ఈ మేరకు సెలైన్ లిక్విడ్‌తో కలిపిన ఆరోగ్యకరమైన మలం నమూనాను దాత అందజేస్తారు. అది మీ జీర్ణాశయం ద్వారా కొలొనోస్కోపీ ద్వారా ఫ్లష్ చేయబడుతుంది. ఇది మీ సిస్టమ్‌లోకి వచ్చిన తర్వాత, ఇది C. డిఫ్‌ను దాత మలం నుంచి ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాతో భర్తీ చేస్తుంది. ఇది వ్యాధి చికిత్సలో 90 శాతం ప్రభావావంతంగా పనిచేసినట్లు తెలుస్తోంది.

FMTకి కూడా దాని పరిమితులు ఉన్నాయి. ముఖ్యంగా దాత నుంచి మలం నమూనాను ఉపయోగించినప్పుడు. అవయవ మార్పిడి వలె, విదేశీ మలం(ఫారిన్ పూప్) తిరస్కరించబడే అవకాశం ఉంది. ఆరోగ్యకరమైన మలం నమూనా అవసరమైన అదే రోగి నుంచి వచ్చినట్లయితే, తిరస్కరణ సంభావ్యత తగ్గడం సహా విజయవంతమైన చికిత్సా అవకాశాలు పెరుగుతాయని బృందం నమ్ముతుంది. దీన్ని సాధించేందుకు వ్యక్తి మల నమూనాను వారు యవ్వనంగా ఉన్నప్పుడు తీసుకోవడం ఉత్తమం. వారికి FMT అవసరమైనప్పుడు, అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు క్రయోజెనిక్‌గా స్తంభింపజేయాలి.

ఆటోలాగస్ మార్పిడి సహజంగా దాత-గ్రహీత అనుకూలత సమస్యలను నివారిస్తుంది లేదా కనీసం తగ్గించగలదు. అయితే దీర్ఘకాల నిల్వ సమయం, సంరక్షణ, పునరుజ్జీవనం విధానాలను క్రమపద్ధతిలో పరీక్షించేందుకు మరింత పరిశోధన అవసరమవుతుంది. క్రియోప్రెజర్వేషన్ అవసరాలు అసమానతను ప్రోత్సహించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ సంపన్న వ్యక్తులు మాత్రమే పూప్ బ్యాంక్‌లో డిపాజిట్ చేయగలరు. లిక్విడ్ నైట్రోజన్ నిల్వచేయడం చౌకగా లేకపోవడమే ఇందుకు కారణం. ఇది తక్కువ ఆదాయ వ్యక్తుల విషయంలో సి. డిఫ్ వంటి వ్యాధులు అసమానంగా ప్రభావితం చేయొచ్చు. ఈ సమస్యను పరిష్కరించేందుకు వ్యాపారవేత్తలు, శాస్త్రవేత్తలు, బహుశా ప్రభుత్వాల ఉమ్మడి శక్తి అవసరమని భావిస్తున్నాను.

- యాంగ్-యు లియు, హార్వర్డ్‌లోని మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్

Next Story

Most Viewed