యాదాద్రి లక్ష్మీ నరసింహ.. పంచకుండాత్మక యాగానికి ఏర్పాట్లు పూర్తి

by Disha Web Desk 13 |
యాదాద్రి లక్ష్మీ నరసింహ.. పంచకుండాత్మక యాగానికి ఏర్పాట్లు పూర్తి
X

దిశ, యాదగిరిగుట్ట: యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ ఉద్ఘాటన పర్వంలో చేపట్టే పంచకుండాత్మక మహాయాగం పనులు జరుగుతున్న సంప్రదాయ సన్నాహాలతో పనులు వేగవంతం చేశారు. 21వ రోజున సోమవారం పుణ్యాహవాచనం, రక్షాబందనం, పంచగవ్య ప్రాశన మృత్సంగ్రహణం, అంకురార్పణం, ఋత్విక్ వరుణం, అఖండ జ్యోతి ప్రజ్వలన, యాగశాల ప్రవేశం, కుంభ స్థాపన వాస్తు పూజ, వాస్తు బలి, హోమం, వాస్తు పర్వగ్నకరణం, శాంతిపాఠం, అవధారలు, యాగశాలలో చతుస్థానార్చన, ద్వార తోరణ సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం ఈ మేరకు పంచకుండాలను పుట్ట, ఎర్ర మట్టితో సిద్ధం చేస్తున్నారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి చతుర్వేదాలతో మహా యాగం నిర్వహణకు హోత, పరిచారక, పర్యవేక్షకులు ఆదివారం యాగశాలలో ఏర్పాటు చేసిన ప్రవేశ ద్వారాలు సాయంత్రానికి ఇక్కడికి చేరుకుంటారు.


యాగానికి అవసరమయ్యే ద్రవ్యాల సేకరణ పూర్తయింది. కుండాల నిర్మాణం పూర్తికాగానే శుద్ధి చేపడుతారు. నలువైపులా యాగశాల ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేశారు. సంప్రదాయ కట్టడాలతో యాగశాల సంపూర్ణం కాబోతుందని ఆలయ ప్రధాన అర్చకులు నల్లంథిగల్ లక్ష్మీ నరసింహ చార్యులు తెలిపారు. సోమవారం మొదలయ్యే మహాయాగ నిర్వహణకు ముందస్తుగా ఏర్పాటైన కుండాలలో అభిముఖంగా ఏర్పాటయ్యే మూర్తులు, ఆళ్వారులు, శ్రీ సుదర్శన చక్రం శనివారం ఆయన పరిశీలించారు.

యాదాద్రి పాత గుట్ట నందు కళ్యాణ మహోత్సవం..

యాదాద్రిలో నిత్య కల్యాణోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు, శ్రీ పాత లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో పాతగుట్ట నందు ఈ రోజు భక్తులచే 22 ఆర్జిత కల్యాణోత్సవములు.. ఒక శాశ్వత కల్యాణోత్సవము నిర్వహించనైనది.



Next Story