AdaptiveSync రిఫ్రెష్ రేట్‌తో సరికొత్త Redmi 10 2022

by Web Desk |
AdaptiveSync రిఫ్రెష్ రేట్‌తో సరికొత్త Redmi 10 2022
X

దిశ, వెబ్‌డెస్క్: చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ Redmi కొత్త ఫోన్‌ను విడుదలచేసింది. Xiaomi ఒక బ్లాగ్ పోస్ట్ ద్వారా Redmi 10 2022 లాంచ్‌ను ప్రకటించింది. ఇది MediaTek Helio G88 SoC ద్వారా రన్ అవుతుంది. కొత్త ఏడాదిలో Redmi సంస్థ వరుసగా కొత్త టెక్నాలజీతో స్మార్ట్ ఫోన్‌లను లాంచ్ చేస్తుంది. ప్రజలకు అందుబాటులో ఉండే ధరలో మరిన్ని స్మార్ట్ ఫోన్‌లను తీసుకురానున్నట్లు కంపెనీ ప్రకటించింది.

Redmi 10 2022 స్పెసిఫికేషన్స్

Redmi 10 2022 6.5-అంగుళాల పూర్తి-HD+ డాట్‌డిస్ప్లే స్క్రీన్‌తో 90Hz వరకు AdaptiveSync రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. స్క్రీన్ రీడింగ్ మోడ్ 3.0 అలాగే సన్‌లైట్ డిస్‌ప్లే, 405ppi పిక్సెల్ డెన్సిటీ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌ను కూడా ఉంది. ఈ ఫోన్ MediaTek Helio G88 SoC ద్వారా అందించబడింది. ఆర్మ్ మాలి-G52 GPU 4GB RAM తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 11-ఆధారిత MIUI 12.5 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌తో నడుస్తుంది. ఫోన్ వెనుక భాగంలో AI క్వాడ్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది, 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ సెన్సార్, 120-డిగ్రీల ఫీల్డ్-ఆఫ్-వ్యూ, రెండు 2-మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. ముందు 8-మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్‌ను కలిగి ఉంది. ఫోన్ 128GB వరకు eMMC నిల్వను కలిగి ఉంది. దీనిని మైక్రో SD కార్డు ద్వారా 512GB వరకు పెంచవచ్చు.




ఫోన్‌లోని కనెక్టివిటీ కోసం 4G LTE, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ v5.1, NFC, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, AI ఫేస్ అన్‌లాక్, GPS, A-GPS, గెలీలియో, గ్లోనాస్, బీడౌ, ఇ-కంపాస్, యాక్సిలరోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, వైబ్రేషన్ మోటార్ కూడా ఉన్నాయి. Redmi 10 2022 లో స్టీరియో స్పీకర్ సెటప్, IR బ్లాస్టర్ ఉన్నాయి. ఇది 18W ఫాస్ట్ చార్జింగ్, 9W రివర్స్ వైర్డ్ చార్జింగ్‌ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగిఉంది. ఈ స్మార్ట్ ఫోన్, ఎడిషన్ కార్బన్ గ్రే, పెబుల్ వైట్, సీ బ్లూ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. Redmi 10 2022 4GB RAM + 64GB, 4GB RAM + 128GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంది.

Next Story

Most Viewed