యూనివర్సిటీ స్థాయిలో రెజ్లింగ్ పోటీలు.. బంగారు పతకంతో సత్తా చాటిన విద్యార్థిని

by Web Desk |
యూనివర్సిటీ స్థాయిలో రెజ్లింగ్ పోటీలు.. బంగారు పతకంతో సత్తా చాటిన విద్యార్థిని
X

దిశ, సంగారెడ్డి : హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో మహిళ క్రీడా పోటీలు జరిగాయి. వీటిలో సంగారెడ్డిలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని సంహిత తన సత్తా చాటింది. రెజ్లింగ్ (కుస్తీ) పోటీల్లో గోల్డ్ మెడల్(బంగారు పతకం) సాధించి తానేంటో నిరూపించుకుంది. విశ్వవిద్యాలయ స్థాయిలో నిర్వహించిన కాలేజ్ మహిళా క్రీడా పోటీల్లో రెజ్లింగ్ 72 కిలోల విభాగంలో సంహిత విజేతగా నిలిచింది. వీటిలో బంగారు పతకాన్ని సాధించి, జాతీయ స్థాయి క్రీడలకు ఎంపికైంది.

సంగారెడ్డిలోని మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్, అధ్యాపకులు విద్యార్థినిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ హుమేరా సయీద్ మాట్లాడుతూ.. క్రీడల్లో బంగారు పతకం సాధించడం అభినందనీయమని , జాతీయ స్థాయిలో కూడా గొప్పగా రాణించి కళాశాలకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం మల్లిక, అశోక్, విమల, కృష్ణప్రియ, నవ్య, సుచిత్ర, లావణ్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed