WhatsApp సంచలన నిర్ణయం.. మార్చి 31 నుంచి సేవలు బంద్

by Disha Web Desk 17 |
WhatsApp సంచలన నిర్ణయం.. మార్చి 31 నుంచి సేవలు బంద్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆదరణ కలిగినటువంటి వాట్సాప్ సంచలనం నిర్ణయం తీసుకుంది. మార్చి 31 నుండి ఆండ్రాయిడ్, iOS లేదా KaiOS వెర్షన్‌లలో నడుస్తున్న పాత సాఫ్ట్‌వేర్‌‌లలో WhatsApp పనిచేయదని కంపెనీ స్పష్టం చేస్తోంది. ఆండ్రాయిడ్ 4.1 లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్‌లలో మాత్రమే పనిచేయనుంది. అంతకంటే తక్కువ వెర్షన్‌లలో పనిచేయదు. iOS 10 లేదా ఆ తర్వాత నడుస్తున్న iPhone ల వినియోగదారులు తమ పరికరాల్లో WhatsApp ని ఉపయోగించుకోగలరు. ఆపిల్ ప్రస్తుతం iOS 15 ని విక్రయిస్తోంది. జైల్‌బ్రోకెన్ ఐఫోన్‌లను ఉపయోగించవద్దని వాట్సాప్ తెలిపింది. KaiOS ప్లాట్‌ఫారమ్ ద్వారా పనిచేసే ఫోన్‌లలో KaiOS వెర్షన్ 2.5 లేదా అంతకంటే కొత్త వెర్షన్‌లో మాత్రమే పనిచేస్తుంది.

Motorola Droid Razr, Xiaomi HongMi, Mi2a, Mi2s, Redmi Note 4G, HongMi 1s, Huawei Ascend D, Quad XL, Ascend D1, Quad XL, Ascend P1 S, Samsung Galaxy Trend Lite, Galaxy S3 mini, Galaxy Xcover 2, Galaxy Core వంటి మోడల్స్‌లో WhatsApp పనిచేయదని కంపెనీ తెలిపింది.



Next Story

Most Viewed