వణుకు పుట్టిస్తున్న కొత్త వైరస్.. 88శాతం మరణాలు రేటు

by Disha Web Desk |
వణుకు పుట్టిస్తున్న కొత్త వైరస్.. 88శాతం మరణాలు రేటు
X

దిశ, ఫీచర్స్ : ఇప్పటికి కూడా కరోనా మహమ్మారి భయపెడుతూనే ఉండగా.. కొత్తగా మరో వైరస్ వణుకు పుట్టిస్తోంది. ఎబోలా కుటుంబానికి చెందిన 'మల్బర్గ' వైరస్ కారణంగా ఇప్పటికే 'ఘనా'లోని ఇద్దరు వ్యక్తులు మరణించగా.. వారి శాంపిల్స్ టెస్ట్ చేసింది ధృవీకరించింది WHO. అంతేకాదు వారికి ఎక్స్‌పోజ్ అయిన 98 మందిని ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉంచారు.

మర్బర్గ్ వైరస్ అంటే ఏంటి?

ఇది ఎబోలా వైరస్ కుటుంబానికి చెందిన హెమరేజిక్ ఫీవర్ వైరస్. గబ్బిలాల ద్వారా వ్యాపించే ఈ వైరస్ సోకిన వ్యక్తుల రక్తం, స్రావాలు, అవయవాలు లేదా ఇతర శారీరక ద్రవాల ద్వారా మరొకరికి వ్యాప్తిచెందుతుంది. ఇక ఈ వైరస్ గాలి ద్వారా వ్యాపించేది కాదని చెప్తున్న WHO.. మరణాల రేటు 88 శాతంగా ఉంటుందని తెలిపింది.

లక్షణాలు:

మల్బర్గ్ వైరస్ సోకిన వారిలో లక్షణాలు బయటపడేందుకు 2 నుంచి 21 రోజులు సమయం పడుతుంది. అయినప్పటికీ ఒక్కోసారి అకస్మాత్తుగా అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులు, తిమ్మిరి వంటివి ఈ వ్యాధి లక్షణాలు కాగా కొన్ని సందర్భాల్లో వ్యాధి సోకిన ఎనిమిది నుంచి తొమ్మిది రోజుల్లో మరణం సంభవించవచ్చు.

మర్బర్గ వైరస్ ట్రీట్మెంట్, నివారణ :

ప్రస్తుతం ఈ వ్యాధికి ఎటువంటి ట్రీట్మెంట్, వ్యాక్సిన్ లేదు. ఓరల్ లేదా ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్‌తో హైడ్రేట్‌గా ఉంచడం, సరైన ఆక్సిజన్ లెవల్స్ మెయింటెన్ చేయడం ద్వారా రోగి జీవించే అవకాశాలు మెరుగుపడతాయి. అందువల్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. కుటుంబసభ్యులతో సహా డాక్టర్స్ కూడా వైరస్ సోకిన వ్యక్తులతో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలని హెచ్చరించారు.

Next Story

Most Viewed