మ‌రో ల‌క్షా ప‌ద‌హారు వేల ఉద్యోగాల సంగ‌తేంటీ..? పీడీఎస్‌యూ

by Disha Web Desk 19 |
మ‌రో ల‌క్షా ప‌ద‌హారు వేల ఉద్యోగాల సంగ‌తేంటీ..? పీడీఎస్‌యూ
X

దిశ‌, ఎల్బీన‌గ‌ర్: రాష్ట్రంలో పీఆర్సీటీ క‌మిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ల‌క్షా తొంబై ఆరువేల ఉద్యోగ ఖాళీలు ఉంటే కేవ‌లం 80 వేల ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తున్నట్లు ప్రక‌టించ‌డం హాస్యాస్పదంగా ఉంద‌ని, మ‌రో ల‌క్షా ప‌ద‌హారు వేల ఉద్యోగాల సంగ‌తేంట‌ని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్ష, కార్యద‌ర్శి మామిడికాయ‌ల ప‌ర‌శురాం, ఇడంపాక విజ‌య్ క‌న్నాలు ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి బుధ‌వారం అసెంబ్లీలో ప్రకటించిన 80 వేల‌ ఉద్యోగాల భర్తీ ప్రకటన సరే కానీ.. గతంలో పీఆర్సీ కమిటీ చెప్పిన విధంగా మొత్తం ఖాళీలతో కలుపుకొని లక్షా, తొంభై ఆరువేల ఉద్యోగాలు భర్తీ ప్రక్రియను కూడా వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. అదే విధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న 26లక్షల నిరుద్యోగులకు అందరికీ వెంటనే నిరుద్యోగ భృతి చెల్లించాలన్నారు. ఈ ఉద్యోగ నియామక ప్రక్రియలో చట్టబద్ధంగా జాప్యం లేకుండా సరైన రీతిలో వెంటనే నియామకాలు చేపట్టాలని కోరారు. పాఠశాల విద్యలో సుమారు ఇరవై ఏడు వేల ఖాళీలు ఉంటే కేవలం 13 వేలు భర్తీ చేయటం సరికాదన్నారు. ఎనిమిదేళ్ల కాలంలో కేవలం కొన్ని పోలీసు ఉద్యోగాలు, ఒక టీఆర్‌టీ వేసి మిగిలిన‌ ఉద్యోగాలు భర్తీ చేయకుండా కాలయాపన చేస్తూ అనేక మంది నిరుద్యోగుల చావుకు కారణమైన కేసీఆర్ వెంటనే క్షమాపణ చెప్పి వారి కుటుంబాలను అడుకోవాలని డిమాండ్ చేశారు. ఇది ఎన్నికల ఎత్తుగడలో భాగం కాకుండా చిత్తశుద్ధితో ప్రభుత్వం నియామకాలు చేపట్టాలని పీడీఎస్‌యూ డిమాండ్ చేస్తుంద‌ని పేర్కొన్నారు.



Next Story