వేధింపులపై మహిళలకు అవగాహన కల్పించే 'కాల్‌ఇట్అవుట్'!

by Disha Web Desk 12 |
వేధింపులపై మహిళలకు అవగాహన కల్పించే కాల్‌ఇట్అవుట్!
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న ప్పటికీ.. కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో వేధింపులు ఎదుర్కొంటూనే ఉన్నారు. అయితే, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ట్రూకాలర్ 'హరాస్‌మెంట్స్'పై నోరు విప్పాలంటూ 'కాల్ఇట్అవుట్(#Callitout)' పేరుతో క్యాంపెయిన్ ప్రారంభించింది. 2020లో ట్రూకాలర్ నిర్వహించిన అధ్యయనాల ప్రకారం.. భారత్‌లోని ప్రతీ 10 మంది మహిళల్లో 8 మంది వేధింపులతో పాటు ఇబ్బందికర కాల్స్ ఎదుర్కొంటున్నారు.

ఇక ప్రతి ఐదుగురిలో ఒకరిని అనుచిత, లైంగికపరమైన కాల్స్ లేదా సందేశాలు వేధిస్తున్నాయి. ఇందులో 76% వరకు తెలియని వ్యక్తుల నుంచి, 4% తెలిసిన వారినుంచే వస్తున్నట్లు వెల్లడైంది. దేశంలోని మెట్రో నగరాల్లోనే సమస్య తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ తరహా వేధింపులపై అవగాహన కల్పించడంతో పాటు నిందితులపై చర్యల పట్ల మహిళల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ట్రూకాలర్ 2017లోనే '#itsnotok' క్యాంపెయిన్‌ చేపట్టింది. దీనికి కొనసాగింపుగానే ఇప్పుడు 'కాల్ ఇట్ అవుట్' ప్రారంభించింది.

ఇందులో భాగంగా ట్రూకాలర్.. సైబర్ పీస్ ఫౌండేషన్‌ భాగస్వామ్యంతో సైబర్-సేఫ్టీ ప్రోగ్రామ్‌ మొదలుపెట్టింది. ఈ మేరకు మహిళలకు ఆన్‌లైన్ భద్రత కల్పించడంతో పాటు స్వయం సాధికారిత దిశగా వారిని శక్తివంతులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో దాదాపు 15 లక్షల మందికి శిక్షణ ఇవ్వనుంది. #ItsNotOk- కాల్ ఇట్ క్యాంపెయిన్.. వేధింపులను ఎదుర్కొనేందుకు ప్రతి భారతీయ అమ్మాయిని సిద్ధం చేసేందుకు ఒక మార్గంగా పనిచేస్తుందని ఆశిస్తున్నాం. ఈ విషయంలో స్త్రీలు తీసుకోగల చర్యల గురించి అవగాహన పెంచడం, అలాంటి సందర్భాల్లో చట్టం అమలుకు సంబంధించి సాయమందించేందుకు కృషి చేస్తాం. ఇక ప్రయాణాల్లో వ్యక్తిగత భద్రత కోసం 'గార్డియన్స్' యాప్ సాయం చేస్తోంది. మేము మహిళల భద్రత కోసం కట్టుబడి ఉండటాన్ని బాధ్యతగా భావిస్తున్నాం.

- ట్రూకాలర్



Next Story

Most Viewed